టీ20 అంటే బ్యాట్స్‌మెన్ గేమ్ అని చెప్పొచ్చు. కరోనా కారణంగా బంతికి లాలాజలం వాడటంపై నిషేధం విధించారు. దీంతో బౌలర్లు మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. యూఏఈ వేదికగా జరుగుతోన్న 13వ సీజన్ ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చే బౌలర్లు విరివిగా పరుగులు సమర్పించుకుంటున్నారు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేస్తూ అసలు సిసలు టీ20 బౌలర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు.
![Unheralded Washington Sundar shines in RCB's Victories](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9157287_wc.jpg)
బెంగళూరు మ్యాచ్ గెలిచిందంటే అభిమానులు సారథి కోహ్లీ, విధ్వంసకర బ్యాట్స్‌మన్ డివిలియర్స్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు. లేదా యువ బౌలర్ సైనీని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ ఆర్సీబీ గెలిచినా.. ఓడినా స్థిరంగా మంచి ప్రదర్శన చేస్తోంది వాషింగ్టన్ సుందర్ మాత్రమే. కానీ అతడికి తగ్గ గుర్తింపు రావడం లేదు. బెంగళూరులో అండర్రేటెట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది సుందరే.
సుందర్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడి 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. ఎకానమీ 4.90గా ఉండటం గమనార్హం. యూఏఈ పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ చెలరేగుతున్న వేళ 6 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయడం మామూలు విషయం కాదు. ఇప్పటికే ఈ సీజన్ సగం మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా మిగిలిన మ్యాచ్‌ల్లో కూడా ఇలాంటి ప్రదర్శనే కనబరిస్తే సుందర్ ఐపీఎల్ స్టార్‌గా నిలుస్తాడనడంలో సందేహం లేదు.
![Unheralded Washington Sundar shines in RCB's Victories](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8982647_washington-sundar.jpg)