ETV Bharat / sports

ఈ ఐపీఎల్​.. అందరికీ ప్రియమైన లీగ్​ - ముంబయి జట్టు

హోరాహోరీ మ్యాచ్‌లు.. కళ్లు తిప్పుకోనివ్వని ఉత్కంఠ క్షణాలు.. చివరి వరకూ సాగిన పోరాటాలు.. నిమిషాల్లో మారిన ఫలితాలు.. ఊహకందని మలుపులు.. వెరసి ఐపీఎల్‌-13 మునుపెన్నడూ లేనంతగా వినోదాన్ని పంచింది. తొలిసారి పూర్తిగా యూఏఈలోనే జరిగిన ఈ సీజన్‌ ఐపీఎల్‌కు ఉన్న విలువను, గుర్తింపును మరింత పెంచింది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో.. ఏదో ఓ లీగ్‌ జరిగిందని మాత్రమే అనిపించేలా కాకుండా.. అంతకుమించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించింది. ఇంతకు ముందెన్నడూ చూడని వింతలు, విశేషాలు ఈ లీగ్‌లో ఎన్నో జరిగాయి. అవేంటో ఓసారి చూద్దాం పదండి

the special moments in indian premier leaugue 2020
ఈ ఐపీఎల్​.. అందరికీ ప్రియమైన లీగ్​
author img

By

Published : Nov 12, 2020, 8:35 AM IST

టీ20 క్రికెట్‌ అంటేనే రసవత్తర పోరాటాలకు చిరునామా. అలాంటిది ఇక ఐపీఎల్‌లో ఆ మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ కిక్కును మరింత పెంచుతూ ఈ పదమూడో సీజన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత హోరాహోరీగా సాగిన సీజన్‌గా నిలిచింది. గతంలో లీగ్‌ దశలో మరో పది మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌ చేరే జట్లపై ఓ స్పష్టత వచ్చేది. కానీ ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌ వరకూ ఉత్కంఠ కొనసాగింది. చివరి రెండు మ్యాచ్‌లకు ముందు వరకూ కేవలం ముంబయి ఇండియన్స్‌ మాత్రమే ప్లేఆఫ్‌ బెర్త్‌ ఖరారు చేసుకుందంటే పోటీ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క విజయమే తేడా..

లీగ్‌ దశ చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాల తర్వాతే దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందంజ వేశాయి. సన్‌రైజర్స్‌, ఆర్సీబీ, కేకేఆర్‌ తలో 14 పాయింట్లతో.. పంజాబ్‌, సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌ తలో 12 పాయింట్లతో లీగ్‌ను ముగించాయి. ఆఖరి స్థానంలో నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ (6 విజయాలు)తో పోలిస్తే లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్‌ కేవలం మూడు విజయాలు మాత్రమే అధికంగా సాధించింది. ప్లేఆఫ్‌ చేరిన చివరి రెండు జట్లకు, తొలి దశలో నిష్క్రమించిన నాలుగు జట్లకు మధ్య తేడా ఒక్క విజయమే. ఈ సీజన్లో 15 పరుగులు, అంతకంటే తక్కువ తేడాతో 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలగా.. నాలుగు, అంతకంటే తక్కువ బంతులు ఉండగా మరో 9 మ్యాచ్‌ల్లో జట్లు గెలిచాయి.

సూపరో సూపర్​ ఓవర్లు..

ఈ సీజన్‌లో సూపర్‌ ఓవర్లు అభిమానులు ఉర్రూతలూగించాయి. లీగ్‌ చరిత్రలో తొలిసారిగా 4 మ్యాచ్‌ల ఫలితాలు సూపర్‌ ఓవర్లో తేలాయి. అంతకుముందు 2013, 2019లో రెండేసి మ్యాచ్‌ల్లో సూపర్‌ ఓవర్లు జరిగాయి. ఈ సీజన్‌ ముందువరకూ ఐపీఎల్‌ మొత్తంలో తొమ్మిది మ్యాచ్‌ల ఫలితాలు సూపర్‌ ఓవర్లో తేలగా.. ఈ ఒక్క సీజన్‌లోనే 4 సూపర్‌ ఓవర్లు కనవిందు చేశాయి. అందులోనూ ఒక్క మ్యాచ్‌లోనే (పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య) రెండు సూపర్‌ ఓవర్లు నమోదవడం విశేషం. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ రెండో సూపర్‌ ఓవర్లో నెగ్గింది. దాని కంటే ముందు దిల్లీ, పంజాబ్‌.. ఆర్సీబీ, ముంబయి.. కేకేఆర్‌, సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ ఫలితాలు సూపర్‌ ఓవర్లో తేలాయి.

చరిత్ర మార్చుకున్న చెన్నై..

ఐపీఎల్‌ అంటేనే.. చెన్నైతో ఫైనల్లో ఆడడం కోసం మిగతా ఏడు జట్లు పోటీపడడం అనే ఓ అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఆడిన ప్రతిసారి ప్లేఆఫ్‌ చేరడమే కాకుండా ఎనిమిది సార్లు ఫైనల్‌ ఆడి.. మూడు సార్లు విజేతగా నిలిచిన ఘన చరిత్ర ఆ జట్టుకుండడమే దానికి కారణం. కానీ ఈ సీజన్‌లో ఆ జట్టు పేలవ ప్రదర్శనతో.. లీగ్‌ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్‌ చేరకుండానే నిష్క్రమించింది. 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించిన ఆ జట్టు ఏడో స్థానంతో లీగ్‌ను ముగించింది. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌ తొలిసారి ఐపీఎల్‌ ఫైనల్స్‌ ఆడింది.

the special moments in indian premier leaugue 2020
ధోనీ

ధావన్​ అదరహో.. సిరాజ్​ అద్భుతహ..

శిఖర్‌ ధావన్‌

ఈ సీజన్‌లో దిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఓ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. చెన్నైపై 101 పరుగులు చేసిన అతను, ఆ తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్‌పై 106 పరుగులు చేశాడు. మరోవైపు హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ ఎప్పటికీ గుర్తుండిపోయే బౌలింగ్‌ ప్రదర్శనతో సత్తాచాటాడు. ఆర్సీబీ తరపున ఆడిన అతను.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో రెండు మెయిడిన్లు వేసి ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను 8 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

సిరాజ్​

ఆరంగేట్రంలోనే అదరగొట్టిన పడిక్కల్​

దేవ్​దత్​ పడిక్కల్​

అరంగేట్ర ఐపీఎల్‌ సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన భారత దేశవాళీ ఆటగాడిగా దేవ్‌దత్‌ పడిక్కల్‌ నిలిచాడు. బెంగళూరు తరపున ఓపెనర్‌గా నిలకడైన ప్రదర్శన చేసిన అతను 473 పరుగులతో సీజన్‌ను ముగించాడు. మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అతను రెండో స్థానంలో ఉన్నాడు. షాన్‌ మార్ష్‌ (2008లో 616) అతనికంటే ముందున్నాడు. మరోవైపు ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండా ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఇషాన్‌ కిషాన్‌ (516) నిలిచాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్2020.. కల్లోల కాలంలో ఆశల వారధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.