ETV Bharat / sports

కోల్​కతాXహైదరాబాద్​: విజయమే లక్ష్యంగా బరిలోకి!

కోల్​కతా నైట్​ రైడర్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్​ ఆడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

Sunrisers Hyderavad vs Kolkata Knight Riders
కోల్​కతాXసన్​రైజర్స్​
author img

By

Published : Oct 18, 2020, 5:31 AM IST

అబుదాబి వేదికగా మరో రసవత్త పోరుకు రంగం సిద్ధమైంది. ఎనిమిది మ్యాచుల్లో నాలుగు గెలిచి, నాలుగో స్థానంలో ఉన్న కోల్​కతా... ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తాము ఆడిన గత మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లు.. ఈ సారి ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి.

ఈ మ్యాచ్​లోనైనా గెలుస్తుందా?

వరుస వైఫల్యాలతో కోల్​కతా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ కారణంగానే దినేశ్ కార్తిక్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని మోర్గాన్​ ఆ బాధ్యతలు అప్పగించాడు. అయినా సరే ముంబయితో గత మ్యాచ్​లో ఓడింది. అందులో కమిన్స్​(53), మోర్గాన్​(39) మినహా మిగిలిన బ్యాట్స్​మెన్ పేలవ ప్రదర్శన చేశారు. కోల్​కతా బౌలర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. సన్​రైజర్స్​తో మ్యాచులో పూర్తి దృష్టి సారించి, సరైనా వ్యూహాలతో బరిలో దిగాలి!

ఏమో అనుమానమే

ఎనిమిది మ్యాచుల్లో మూడింట గెలిచింది హైదరాబాద్. పాయింట్ల పట్టికలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్​లో అడుగుపెట్టాలంటే ఇకపై ప్రతి మ్యాచ్​ గెలవాల్సి ఉంటుంది. ఓపెనర్లు బెయిర్​ స్టో, వార్నర్​లు ప్రదర్శనలో నిలకడ లోపిస్తోంది. మిడిల్​ ఆర్డర్​లో మనీశ్​ పాండే, కేన్​ విలియమ్సన్​, ప్రియమ్​ గార్గ్​ కూడా అంతే. మొత్తంగా వీరంతా విజృంభిస్తేనేనే కోల్​కతాపై గెలవొచ్చు. లేదంటే కథ మళ్లీ మాములే. బౌలింగ్​లో యార్కర్​ స్పెషలిస్టు నటరాజన్​, స్పినర్​ రషీద్​ ఖాన్​తో బలంగా ఉంది. కానీ ఫలితం లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలో సన్​రైజర్స్​ ఏం చేస్తుందో చూడాలి.

జట్లు (అంచనా)

కోల్​కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్​మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, క్రిస్ గ్రీన్, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ

హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో (వికెట్​ కీపర్​), మనీశ్​ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.