దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై 88 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 220 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ.. 19 ఓవర్లకే 131 పరుగులు చేసి ఆల్ఔట్ అయ్యింది. విజయంలో వృద్ధిమాన్ సాహా (87; 45 బంతుల్లో, 12×4, 2×6), డేవిడ్ వార్నర్ (66; 34 బంతుల్లో, 8×4, 2×6), మనీష్ పాండే(44) కీలక పాత్ర పోషించారు. దిల్లీ బౌలర్లలో అశ్విన్, నోర్జే తలో వికెట్ తీశారు.
దిల్లీ క్యాపిటల్స్‌పై హైదరాబాద్ అద్భుత విజయం - ఐపీఎల్ 2020 లైవ్ అప్డేట్స్
22:52 October 27
22:49 October 27
ఓటమికి చేరువలో ఉంది దిల్లీ క్యాపిటల్స్. 18 బంతుల్లో 110 పరుగులు చేయడం కష్టం. ప్రస్తుతం 17 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది.
22:31 October 27
సన్‌రైజర్స్ బౌలర్లు దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితంగా 15 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేసింది శ్రేయస్ సేన. క్రీజులో రిషభ్ పంత్, రబాడా ఉన్నారు. 30 బంతుల్లో 124 పరుగులు అవసరం.
22:14 October 27
సన్‌రైజర్స్ బౌలర్లు దిల్లీ క్యాపిటల్స్‌ను బాగా కట్టడి చేస్తున్నారు. విజయ్ శంకర్ బౌోలింగ్లో సారథి శ్రేయస్ అయ్యర్(7) షాట్‌కు యత్నించి విలియమ్సన్ చేతిలో ఔట్ అయ్యాడు. క్రీజులోకి అక్సర్ పటేల్(1) వచ్చాడు. రిషభ్ పంత్(19) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. దీంతో 12 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. 48 బంతుల్లో 138 పరుగులు అవసరం.
22:08 October 27
పది ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది దిల్లీ క్యాపిటల్స్. రిషభ్ పంత్(15), శ్రేయస్ అయ్యర్(4) జాగ్రత్తగా ఆడుతోన్నారు. 59 బంతుల్లో 147 పరుగులు అవసరం.
21:52 October 27
దిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు రహానే(26). దీంతో ఏడు ఓవర్లు నాలుగు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. 78 బంతుల్లో 165 పరుగులు అవసరం
21:38 October 27
నాలుగో ఓవర్లో దిల్లీ క్యాపిటల్స్‌కు కేవలం ఆరు పరుగులే వచ్చాయి. క్రీజులో హెట్మయర్ (2), అజింక్యా రహానే(24 ) నెమ్మదిగా ఆడుతోన్నారు. దీంతో నాలుగు ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది.
21:27 October 27
ధావన్ ఔట్...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ తొలి ఓవర్లోనే ఔటయ్యాడు.
20:57 October 27
సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వార్నర్ సేన.. దిల్లీ క్యాపిటల్స్‌కు 220 భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. వార్నర్ (66), వృద్ధిమాన్ సాహా(87), మనీష్ పాండే(44) దుమ్మురేపారు. దిల్లీ బౌలర్లలో అశ్విన్, నోర్జే తలో వికెట్ తీశారు.
20:36 October 27
దూకుడుగా ఆడుతోన్న సన్‌రైజర్స్‌పై దెబ్బ కొట్టింది దిల్లీ. నోర్జే వేసిన బౌలింగ్‌లో సాహా(87) షాట్‌కు యత్నించి శ్రేయస్ చేతికి చిక్కాడు. 14.3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది వార్నర్ సేన.
20:34 October 27
దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో 14.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికిి 170 పరుగులు చేసింది వార్నర్ సేన.
20:12 October 27
సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో వార్నర్(66) షాట్‌కు యత్నించి అశ్విన్ చేతికి చిక్కాడు. దీంతో 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది.
19:55 October 27
సన్‌రైజర్స్ దూకుడుగా ఆడుతోంది. ఆరో ఓవర్లో 22 పరుగలు వచ్చాయి ఈ ఓవర్లో వార్నర్(54) వరుస బౌండరీలతో విజృంభించాడు. సాహా(22) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. ఆరు ఓవర్లకు 77/0 స్కోరు.
19:48 October 27
ఐదో ఓవర్లో హైదరాబాద్‌కు తొమ్మిది పరుగులు మాత్రమే వచ్చాయి. క్రీజులో వార్నర్ (32), సాహా(22) జాగ్రత్తగా ఆడుతోన్నారు. దీంతో 5 ఓవర్లకు వికెట్ ఏమీ కోల్పోకుండా 55 పరుగులు చేసింది వార్నర్ సేన.
19:37 October 27
సన్‌రైజర్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లు ఏమీ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో వృద్ధిమాన్ సాహా(15), వార్నర్(5) ఉన్నారు.
19:06 October 27
జట్ల వివరాలు
దిల్లీ క్యాపిటల్స్ : అజింక్య రహానె, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (సారథి), రిషబ్ పంత్ (డబ్ల్యూ), షిమ్రాన్ హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్జే, తుషార్ దేశ్‌పాండే
సన్‌రైజర్స్ హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (సారథి), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహా (డబ్ల్యూ), జాసన్ హోల్డర్, షాబాజ్ నదీమ్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టి. నటరాజన్
19:01 October 27
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది దిల్లీ క్యాపిటల్స్. దీంతో బ్యాటింగ్ దాడికి దిగనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
18:32 October 27
దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దిల్లీ మరి కాసేపటిలో తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దిల్లీ భావిస్తోండగా... మరోవైపు ఇందులో గెలిచి పరువు నిలుపుకోవాలని వార్నర్ సేన అనుకుంటోంది.

TAGGED:
ipl live