ETV Bharat / sports

'అతడిపై రోజురోజుకూ ఇష్టం పెరుగుతోంది'

ఐపీఎల్​లో అన్ని జట్లను అనుసరిస్తున్నానని తెలిపింది టీమ్​ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన. రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు సంజూ శాంసన్ ఆట చూస్తుంటే క్రేజీగా అనిపిస్తోందని వెల్లడించింది.

Smriti Mandhana become a fan for Sanju Samson
'అతడిపై రోజురోజుకూ ఇష్టం పెరుగుతోంది'
author img

By

Published : Oct 1, 2020, 6:25 PM IST

Updated : Oct 1, 2020, 6:59 PM IST

ఐపీఎల్​లో ఏదో ఒక జట్టుకే తాను మద్దతుగా ఉండటం లేదని టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన తెలిపింది. యూఏఈలో జరుగుతున్న లీగ్​లో తనకు ఇష్టమైన క్రికెటర్లను అనుసరిస్తున్నానని వెల్లడించింది. షార్జాలో అద్భుతమైన షాట్లతో అలరించిన యువ ఆటగాడు సంజూ శాంసన్‌పై ఇష్టం రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది.

Smriti Mandhana become a fan for Sanju Samson
సంజూ శాంసన్

"నేను అన్ని మ్యాచుల్నీ వీక్షిస్తున్నా. ఏదో ఒక జట్టుకు మద్దతు ఇవ్వడం లేదు. ఆటగాళ్లను బట్టి ప్రోత్సహిస్తున్నా. విరాట్‌కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనీకి మద్దతు ఇస్తున్నా. రాజస్థాన్‌ యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు పెద్ద అభిమానిగా మారిపోయా. అతడు బ్యాటింగ్‌ చేస్తుంటే క్రేజీగా అనిపిస్తోంది. అతడి వల్లే రాజస్థాన్‌కు మద్దతు ఇస్తున్నా. అతడి బ్యాటింగ్‌ క్రేజీగా, ఉన్నత స్థాయిలో కనిపిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తున్న ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా."

-స్మృతి మంధాన, భారత మహిళా క్రికెటర్

లీగ్​లో ప్లేఆఫ్స్‌ జరిగే సమయంలోనే మహిళలకూ ఛాలెంజర్స్‌ ట్రోఫీ నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. ఇందులో ఒక జట్టుకు మంధాన నాయకత్వం వహించే అవకాశం ఉంది.

Last Updated : Oct 1, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.