ETV Bharat / sports

కెప్టెన్ల కొత్త ఆలోచన.. పవర్​ప్లేలో బౌలర్లు భేష్

author img

By

Published : Oct 28, 2020, 4:03 PM IST

Updated : Oct 28, 2020, 4:26 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​ పవర్ ప్లే ఓవర్లలో కొన్ని అనూహ్య నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. స్పిన్నర్లతో బౌలింగ్ దాడిని ప్రారంభించడం కూడా కొన్ని మ్యాచ్​ల్లో సత్ఫలితాలనిచ్చింది. అలా ఈ సీజన్​లోని పవర్ ప్లేలో కెప్టెన్​లు తీసుకున్న కొన్ని తెలివైన నిర్ణయాలేంటో చూద్దాం.

Smart bowling moves of this season's IPL
ఐపీఎల్: బౌలింగ్​లో తెలివైన నిర్ణయాలు ఇవే!

టీ20ల్లో మొదటి పవర్ ప్లే చాలా ముఖ్యం. ఈ సమయంలో బౌండరీ వద్ద ఇద్దరు ఫీల్డర్లే ఉంటారు కాబట్టి బ్యాట్స్​మెన్ ఎక్కువ పరుగులు రాబట్టేందుకు వీలవుతుంది. అందువల్ల ఈ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడానికి బౌలర్లు కాస్త కష్టపడాలి. అందుకే స్వింగ్, సీమ్ బౌలర్లకు బంతిని ఇచ్చేందుకు కెప్టెన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు సారథులు మాత్రం ప్రారంభ ఓవర్లను స్పిన్నర్లతో వేయించి సత్ఫలితాలను సాధించారు. ఈ ఏడాది ఐపీఎల్​ జరుగుతన్న యూఏఈ పిచ్​లు కాస్త స్పిన్​కు అనుకూలంగా ఉండటం వల్ల మెరుగైన ఫలితాలే వచ్చాయి. అలా ఈ ఏడాది బౌలింగ్​లో తీసుకున్న కొన్ని అనుహ్య నిర్ణయాలు ఇవే!

పవర్ ప్లేలో బుమ్రా

అక్టోబర్ 23న చెన్నై-ముంబయి మ్యాచ్​లో బౌల్ట్ తొలి ఓవర్ వేశాడు. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించడం వల్ల రెండో ఓవర్​ను బుమ్రాతో వేయించాడు తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్. అతడి నమ్మకాన్ని నిజం చేస్తూ అదే ఓవర్​లో అంబటి రాయుడు వికెట్ తీశాడు జస్ప్రీత్. గత మ్యాచ్​లను చూసుకుంటే రాయుడుకు ముంబయిపై మంచి రికార్డుంది. తొలుత రెండో ఓవర్​ను కౌల్టర్​ నైల్ లేదంటే స్పిన్నర్​కు ఇవ్వాలని అనుకున్న పొలార్డ్.. పిచ్ పరిస్థితి బుమ్రాకు బంతి ఇవ్వాలని అనుకున్నాడు.

Smart bowling moves of this season's IPL
బుమ్రా

పవర్​ప్లేలో మ్యాక్స్​వెల్

పవర్ హిట్టర్​గా గుర్తింపు తెచ్చుకున్న పంజాబ్ ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్.. ఈ సీజన్​లో బ్యాటింగ్​లో విఫలమవుతున్నాడు. అయితే స్పిన్ బౌలింగ్ కూడా వేయగల ఇతడికి, పవర్​ప్లేలో బంతిని అందిస్తున్నాడు కెప్టెన్ కేఎల్ రాహుల్. వికెట్లు తీయలేకపోతున్నా సరే పరుగులను బాగానే నియంత్రిస్తూ సారథి నమ్మకాన్ని నిలబెడుతున్నాడు.

మ్సాక్స్​వెల్

అక్షర్ పటేల్​తో ఓపెనింగ్

సెప్టెంబర్ 25న చెన్నైతో జరిగిన మ్యాచ్​లో తనకు తొలి ఓవర్ ఇవ్వమని స్పిన్నర్ అక్షర్ పటేల్(దిల్లీ​), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​ను కోరాడు. అలా మొదటి ఓవర్లోనే వాట్సన్​ను పెవిలియన్​కు చేర్చాడు. పంజాబ్​తో మ్యాచ్​లోనూ మూడో ఓవర్ వేసిన అక్షర్.. కేఎల్ రాహుల్​ వికెట్ దక్కించుకున్నాడు.

అక్షర్ పటేల్

సిరాజ్​ చేతికి కొత్త బంతి

బెంగళూరు జట్టులో చేరినప్పటి నుంచి మహ్మద్ సిరాజ్ చేతికి కొత్త బంతిని ఇవ్వలేదు సారథి కోహ్లీ. కానీ ఈ సీజన్​లో కోల్​కతాతో మ్యాచ్​లో ఆశ్చర్యకరంగా సిరాజ్​ చేతికి కొత్త బంతిని ఇచ్చాడు కోహ్లీ. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఏకంగా రెండు మెయిడిన్లు వేశాడు సిరాజ్. టోర్నీ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​గా నిలిచాడు. ఇదే మ్యాచ్​లో మూడు వికెట్లు కూడా దక్కించుకున్నాడు. ​

సిరాజ్

Last Updated : Oct 28, 2020, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.