రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అబుదాబిలో అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది. కోహ్లీ(72*), దేవ్‌దత్(63) అర్ధ శతకాలతో మెరిశారు. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోహ్లీసేన.
-
That's that from Abu Dhabi as @RCBTweets win by 8 wickets to register their third win in #Dream11IPL 2020.#RCBvRR pic.twitter.com/CY2Col5a0y
— IndianPremierLeague (@IPL) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Abu Dhabi as @RCBTweets win by 8 wickets to register their third win in #Dream11IPL 2020.#RCBvRR pic.twitter.com/CY2Col5a0y
— IndianPremierLeague (@IPL) October 3, 2020That's that from Abu Dhabi as @RCBTweets win by 8 wickets to register their third win in #Dream11IPL 2020.#RCBvRR pic.twitter.com/CY2Col5a0y
— IndianPremierLeague (@IPL) October 3, 2020
155 పరుగుల ఛేదనలో బెంగళూరుకు ఆరంభం అదిరింది. 2.3 ఓవర్లలోనే 25 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ ఫించ్.. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్‌కు 99 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ విజయాన్ని ఖరారు చేశారు.
ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్(12*)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు కోహ్లీ. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, గోపాల్.. చెరో వికెట్ పడగొట్టాడు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ జట్టు. ఈ జట్టులో లోమ్రర్(47) మాత్రమే ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో బట్లర్(22), స్మిత్ (5), శాంసన్ 4, ఉతప్ప 17, రియాన్ పరాగ్ 16, తెవాతియా 24*, ఆర్చర్ 16* పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 3, ఉదానా 2, సైనీ 1 వికెట్ పడగొట్టారు.