ETV Bharat / sports

ఆర్సీబీxముంబయి: గెలిస్తే ప్లే ఆఫ్స్​ బెర్తు​ ఖాయం - ipl 2020 updates

ఐపీఎల్​ పోరులో భాగంగా నేడు (బుధవారం) జరిగే మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ హోరాహోరీగా తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్​కు అర్హత సాధిస్తుంది.

RCB
బెంగళూరుxముంబయి
author img

By

Published : Oct 28, 2020, 5:27 AM IST

అబుదాబి వేదికగా నేడు (బుధవారం) జరిగే మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ తలపడనున్నాయి. ఈ పోరులో గెలిచిన వారికి ప్లే ఆఫ్స్​ బెర్తు​ ఖాయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోహిత్​ సేన అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ సేన మూడో స్థానంలో కొనసాగుతోంది. ​​

ఈ సారి కూడా రోహిత్​ లేకుండానే!

ముంబయి ఇండియన్స్​.. సారథి రోహిత్​ లేకుండానే మళ్లీ బరిలో దిగనుందని సమాచారం. బ్యాటింగ్ యూనిట్​ సూర్యకుమార్​ యాదవ్​, సౌరభ్​ తివారీ, ఇషాన్​ కిషన్​ పొలార్డ్, పాండ్యా సోదరులతో బలంగానే ఉంది. రాజస్థాన్​తో జరిగిన గత మ్యాచ్​లో ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్యా మంచి ఫామ్​లోకి వచ్చాడు. డికాక్​ మాత్రం విఫలమయ్యాడు. బౌలింగ్​ యూనిట్​లో బుమ్రా, బౌల్ట్, చాహర్​, జేమ్స్​ ప్యాటిన్సన్​ బాగానే రాణిస్తున్నారు. కానీ గత మ్యాచ్​లో వీరందరూ తేలిపోయారు. మొత్తంగా జట్టులోని ఆటగాళ్లంతా తమ ప్రదర్శనను కొంచెం మెరుగుపరుచుకుంటే ఈ మ్యాచ్​లో సానుకూల ఫలితం లభించొచ్చు.

సమష్టిగా రాణిస్తే విజయం పక్కా

బెంగళూరు జట్టు ప్రస్తుతం మంచి ఫామ్​లో ఉంది. లీగ్​ ప్రారంభంలో తేలిపోయినా గత కొన్ని మ్యాచుల నుంచి కోహ్లీ(415) బాగా రాణిస్తున్నాడు. ఆరోన్​ ఫించ్(236)​, దేవదత్ పడిక్కల్(343)​, డివిలియర్స్ ఇంకాస్త నిలకడగా ఆడితే సరిపోతుంది. మిడిల్​ ఆర్డర్​లో ఉన్న క్రిస్​ మోరిస్​, మొయిన్​ అలీ, గుర్​కీరత్​ మన్​ అంచనాల్ని అందుకోలేకపోతున్నారు. బౌలింగ్​ యూనిట్​ చాహల్​, నవ్​దీప్​ సైనీ, మహ్మద్​ సిరాజ్​తో బలంగా ఉంది. వీరూ కూడా సమష్టిగా రాణిస్తే విజయం ఖాయం.

జట్ల అంచనా

ముంబయి ఇండియన్స్ : క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ (సారథి), కృనాల్​ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్​ బుమ్రా

బెంగళూరు: దేవ్​దత్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, మొయిన్ అలీ, గుర్​కీరత్ సింగ్, మోరిస్, సుందర్, సైనీ, సిరాజ్, చాహల్

ఇదీ చూడండి 'యోయో టెస్టులో కోహ్లీనే మించిపోయాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.