ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ నిలిచాడు. మంగళవారం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడతున్న మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
టోర్నీ ప్రారంభం నుంచి దక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన రోహిత్.. 39 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు ముంబయి ఇండియన్స్ తరపున హిట్‌మ్యాన్‌కు ఇది 155వ మ్యాచ్. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన లీగు మ్యాచ్‌తో రోహిత్ తన 150వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడాడు.
ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు. ధోనీ నేతృత్వంలో సీఎస్కే 2010, 2011, 2018 సీజన్లలో విజేతగా నిలిచింది. ధోనీ ఆడిన 204 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4,632 పరుగులను నమోదు చేయగా.. అందులో 23 అర్ధశ తకాలున్నాయి. అత్యధికంగా 84 రన్స్ చేశాడు ధోనీ.