ఈ సీజన్‌లో తమ జట్టు బాగా ఆడిందని, ప్లేఆఫ్స్‌కు చేరడం సంతోషంగా ఉందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. గతరాత్రి ఆ జట్టు దిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైనా రన్‌రేట్ పరంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. తమ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.
"దిల్లీ ఛేదన చేస్తుండగా 11వ ఓవర్ తర్వాత మా జట్టు యాజమాన్యం 17.3 మార్కును గుర్తు చేసింది. ఈ క్రమంలోనే మేము మధ్యలో బాగా ఆడాం. లేదంటే దిల్లీ అప్పటికే మ్యాచ్‌ను గెలిచేది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరడం సంతోషంగా ఉంది. టాప్‌లో నిలిచిన ముంబయి, దిల్లీ జట్లు అత్యుత్తమంగా ఆడాయి. మేం కూడా మంచి ప్రదర్శన చేశాం. మేము ఫైనల్ చేరడానికి రెండు మ్యాచ్‌లే ఉన్నాయి. ఒక జట్టుగా మాకు ఆ అవకాశాలు చాలు. ఇకపై ఆడాల్సిన మ్యాచ్‌ల గురించి మా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు పవర్‌ప్లేల్లో ధాటిగా ఆడితే మాకూ విజయావకాశాలు ఉన్నాయి. సానుకూల దృక్పథంతో ఉండడం ఎంతో అవసరం."
-విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పడిక్కల్(50) మరోసారి అర్ధ శతకంతో మెరిశాడు. అనంతరం దిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానం సంపాదించుకుంది. మరోవైపు బెంగళూరు 17.3 ఓవర్లలోనే ఓడిపోయి ఉంటే కోల్‌కతా కన్నా తక్కువ రన్‌రేట్ సాధించేది. దాంతో ఆ జట్టు పరిస్థితి తారుమారయ్యేది.
ఇదీ చూడండి:'అతడు యంగ్ కోహ్లీలా కనిపిస్తున్నాడు'