ETV Bharat / sports

'రషీద్ వరల్డ్ క్లాస్ బౌలర్.. ఎప్పుడూ గురి తప్పలేదు'

పంజాబ్​పై విజయానికి కారణమైన బెయిర్​స్టో, రషీద్ ఖాన్​లను మెచ్చుకున్నాడు సన్​రైజర్స్ కెప్టెన్ వార్నర్. ఈ మ్యాచ్​లో 69 పరుగుల తేడాతో గెలిచింది హైదరాబాద్.

Rashid Khan always delivers in pressure situations: Warner
రషీద్ ఖాన్ వార్నర్
author img

By

Published : Oct 9, 2020, 11:18 AM IST

జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, అసలు గురితప్పడని సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. అతడో ప్రపంచస్థాయి బౌలర్​ అని పొగడ్తలు కురిపించాడు. పంజాబ్​ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్​, 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో వార్నర్(52), బెయిర్ స్టో(97) తొలి వికెట్​కు 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాట్స్​మెన్ స్వల్ప స్కోర్లకే వెనుదిరగడం వల్ల నిర్ణీత ఓవర్లలో 202 పరుగులు చేయగలిగిందీ సన్​రైజర్స్. ఛేదనలో పంజాబ్ 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్ (77) ఒంటరి పోరాటం చేశాడు.

Rashid Khan
రషీద్ ఖాన్

"పూరన్ బౌండరీలు కొడుతుంటే చాలా భయపడ్డాను. అతడిని ఎలా ఔట్ చేయాలా అని ఆలోచించి, రషీద్​కు బౌలింగ్ అప్పగించాను. ఇతడో 'వరల్డ్ క్లాస్ బౌలర్'. జట్టు ఒత్తిడిలో ఉన్న సందర్భాల్లో అతడు చాలాసార్లు రాణించాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. బెయిర్ స్టోతో బ్యాటింగ్ చేయడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను" -వార్నర్, హైదరాబాద్ కెప్టెన్

అక్టోబరు 11న రాజస్థాన్ రాయల్స్​తో తర్వాతి మ్యాచ్​ ఆడనుంది సన్​రైజర్స్ హైదరాబాద్. ప్రస్తుతం మూడు మ్యాచ్​లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.