ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో పంజాబ్​పై రాయల్స్​ విజయం - ipl 13 updates

సంజు శాంసన్​ దూకుడు, చివర్లో రాహుల్​ తివాటియా మెరుపులతో.. షార్జా వేదికగా కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్​ రాయల్స్​ అద్భుత విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది ఆర్​ఆర్​. ఐపీఎల్​లో ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం.

rajasthan royals ipl
పంజాబ్​పై రాజస్థాన్​ విజయం
author img

By

Published : Sep 28, 2020, 12:06 AM IST

Updated : Sep 28, 2020, 12:14 AM IST

షార్జా వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై రాజస్థాన్​ రాయల్స్​ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాయల్స్​కు సంజు శాంసన్​(85) మరోసారి అండగా నిలిచాడు. చివర్లో రాహుల్​ తివాటియా ధనాధన్​ ఇన్నింగ్స్​తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్​ చరిత్రలో ఇదే అతి పెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం. శాంసన్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

రెండో ఇన్నింగ్స్​లో రాజస్థాన్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ బట్లర్​ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్​తో స్టీవ్​ స్మిత్(50)​ నిలకడగా ఆడాడు. అయితే కొద్దిసేపటికే సంజూ గేర్​ మార్చి పంజాబ్​ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 85 పరుగుల్లో 7 సిక్సులు, 4 ఫోర్లు ఉండటం విశేషం. అయితే కీలక సమయంలో వికెట్​ చేజార్చుకున్నాడు. షమీ బౌలింగ్ రాహుల్​కు క్యాచ్​ ఇచ్చి​ ఔట్​ అయ్యాడు.

తివాటియా మెరుపులు..

స్మిత్​ ఔట్​ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్​ తివాటియా.. పరుగులు రాబట్టడానికి చాలా కష్టపడ్డాడు. మొదటి 19 బంతుల్లో కేవలం 8పరుగులే చేశాడు. ఒకానొక సందర్భంలో అతడి వల్లే ఆర్​ఆర్​ ఓడిపోతుందేమో అని అనుకున్నారంతా. కానీ 18వ ఓవర్​లో రాహుల్​ ఒక్కసారిగా గేర్​ మార్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. కాట్రియల్​ వేసిన ఆ ఓవర్లలో వరుసగా నాలుగు సిక్సర్ల బాదాడు. ఆర్​ఆర్​ను మళ్లీ రేసులో నిలబెట్టాడు. చివరి బంతిని కూడా సిక్సర్​గా మలిచి తన సత్తాను చాటిచెప్పాడు. ఆ ఒక్క ఓవర్​తో పరిస్థితులు మారిపోయాయి. కొండంత లక్ష్యాన్ని ఛేదించడంలో రాయల్స్​కు ఆ ఓవరే కీలకంగా మారింది.

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌(106; 50 బంతుల్లో 10x4, 7x6), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(69; 54 బంతుల్లో 7x4, 1x6) ఆది నుంచీ బౌండరీలతో అలరించారు. దీంతో వీరిద్దరూ తొలి వికెట్‌కు పంజాబ్‌ తరఫున అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా 183 పరుగులు జోడించారు. శతకం బాది జోరు మీదున్న మయాంక్‌ 16.3 ఓవర్‌లో టామ్‌కరన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి కీపర్‌ సంజూ శాంసన్‌ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌ చివరి బంతికి అంకిత్‌ రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద శ్రేయస్‌ గోపాల్‌ చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్‌ 194 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఇక చివర్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌(13; 9 బంతుల్లో 2x4), నికోలస్‌ పూరన్‌(25; 8 బంతుల్లో 1x4, 3x6) బాగానే రాణించారు. పంజాబ్​ బౌలర్లలో మహ్మద షమీ(3), కాట్రెల్​, జేమ్స్​ నీశమ్, ముర్గన్​ అశ్విన్​​ తలో వికెట్​ తీశారు.

Last Updated : Sep 28, 2020, 12:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.