ETV Bharat / sports

పూరన్​ బ్యాటింగ్​పై దిగ్గజ సచిన్ ప్రశంసలు

author img

By

Published : Oct 21, 2020, 12:29 PM IST

యువ ఆటగాడు​ పూరన్​పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ప్రశంసించాడు. అతడు​ కొట్టే షాట్లు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ డుమినిని గుర్తు చేస్తున్నాయని అన్నాడు.

Pooran's stance and backlift reminds me of Duminy: Tendulkar
'పూరన్​ కొట్టే షాట్లు ఆ మాజీ క్రికెటర్​ను తలపిస్తున్నాయి'

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ బ్యాట్స్​మన్​ నికోలస్​ పూరన్​ను దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ ప్రశంసించాడు. ఇతడు 'క్లీన్​ స్ట్రైకర్​' అని.. అతడి ఆట తీరు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ జేపీ డుమినిని తలపిస్తుందని మాస్టర్​ బ్లాస్టర్​ కితాబిచ్చాడు.

"నికోలస్​ పూరన్​ నుంచి కొన్ని పవర్​ప్యాక్డ్​ షాట్స్​ వచ్చాయి. అవలీలగా బంతిన బౌండరీకి తరలిస్తున్నాడు. అతడి బ్యాటింగ్​ శైలితో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్​మన్​ జేపీ డుమినిని గుర్తు చేశాడు"

- సచిన్ తెందుల్కర్​, దిగ్గజ ఆటగాడు

Pooran's stance and backlift reminds me of Duminy: Tendulkar
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ జేపీ డుమిని

మంగళవారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ అద్భుత విజయం సాధించింది. 165 పరుగుల ఛేదనలో పంజాబ్,​ ఓవర్​ మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. టోర్నీలో హ్యాట్రిక్​ గెలుపును నమోదు చేసింది. పంజాబ్​ బ్యాట్స్​మన్​ నికోలస్​ పూరన్​ అద్భుతమైన బ్యాటింగ్​తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 28 బంతుల్లో 53 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.