ETV Bharat / sports

ధోనీకి సరైన వారసుడు పంత్​: నెహ్రా

author img

By

Published : Oct 6, 2020, 5:05 PM IST

దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్​ను తిరిగి టీమ్​ఇండియాలోకి తీసుకోవాలని సూచించాడు మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా. ఐపీఎల్​లో పంత్ తిరిగి ఫామ్​లోకి వచ్చాడని అన్నాడు.

Pant perfect replacement for Dhoni in Team India: Nehra
ధోనీకి సరైన వారసుడు పంత్​: నెహ్రా

ఇటీవలే టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు. కాగా ఇతడి స్థానంలో వికెట్ కీపర్​గా రిషబ్ పంత్​కు స్థానం కల్పించారు సెలక్టర్లు. కానీ వారి నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేక పోయాడు. దీంతో కేఎల్​ రాహుల్​ను కీపర్​గా ప్రయత్నించింది యాజమాన్యం. అతడు సక్సెస్ కావడం వల్ల పంత్ స్థానం కష్టాల్లో పడిందని అంతా భావించారు.

అయితే పంత్ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్​లో రాణిస్తున్నాడు. దీంతో మరోసారి భారత జట్టుకు వికెట్ కీపర్​గా ఇతడే సరైన వాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీమ్ఇండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

"పంత్‌ను టీమ్​ఇండియాలో ఆడిస్తే బాగుంటుంది. అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి ఆటగాడికి మద్దతు అనేది చాలా అవసరం."

-నెహ్రా, టీమ్​ఇండియా మాజీ బౌలర్

ప్రస్తుత ఐపీఎల్‌లో పంత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లో 171 పరుగులు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.