ETV Bharat / sports

ఇప్పటినుంచి ప్రతి మ్యాచ్​ గెలవాల్సిందే:స్మిత్

అబుదాబి వేడుకగా రాజస్థాన్​తో తలపడ్డ సన్​రైజర్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. కానీ, రాజస్థాన్​ ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. ఇప్పటినుంచి ఆడే ప్రతి మ్యాచ్​ గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు రాజస్థాన్ కెప్టెన్​ స్మిత్.

STEVE SMITH_RR
ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్​ గెలవాల్సిందే:స్మిత్
author img

By

Published : Oct 23, 2020, 4:40 AM IST

గురువారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది రాజస్థాన్​ రాయల్స్. ఈ సందర్భంగా మట్లాడిన జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ఇప్పటి నుంచి ఆడే ప్రతీ మ్యాచ్​ గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రయత్నమైతే చేయగలం కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేం అని అన్నాడు.

" ఆరంభంలో బాగా ఆడాం. జోఫ్రా అర్చర్​ ఇద్దరు హైదరాబాద్ కీలక బ్యాట్స్​మెన్​ను త్వరగా పెవిలియన్​కు పంపాడు. విజయ్​ శంకర్, మనీష్​ పాండే చాకచక్యంగా ఆడి హైదరాబాద్​ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్​కు దిగిన మేము.. మరిన్ని పరుగులు చేసి ఉండాల్సింది. వెనువెంటనే అన్ని మ్యాచ్​లు గెలవడం అంత సులభమేం కాదు. కానీ, ఇప్పటినుంచి అన్ని మ్యాచ్​లు గెలిచే ప్రయత్నం చేస్తాం".

-స్టీవ్​ స్మిత్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్.

ఈ మ్యాచ్​లో రాజస్థాన్​పై గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్. మనీష్​ పాండే (83), విజయ్ శంకర్(52) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి:టెస్టు ఛాంపియన్​షిప్​పై ఐసీసీ అనుహ్య నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.