ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: ఆ విషయంలో కోహ్లీనే టాప్​ - ఫేస్​బుక్​ ఐపీఎల్​ న్యూస్​

కరోనా ప్రభావంతో బయోబబుల్​లో ఐపీఎల్​ను నిర్వహించినా సరే సోషల్ మీడియాలో లీగ్​ గురించి బాగానే మాట్లాడుకున్నారు. అందులో ముఖ్యంగా కోహ్లీ, ముంబయి ఇండియన్స్​ గురించే అత్యధికులు చర్చించుకున్నారని ఫేస్​బుక్ సంస్థ తెలిపింది.

Mumbai Indians, Virat Kohli top conversations on Facebook during IPL
ఐపీఎల్​ 2020: ఫేస్​బుక్​ ముచ్చట్లలో కోహ్లీ టాప్​
author img

By

Published : Nov 13, 2020, 2:14 PM IST

ఇటీవలే ముగిసిన ఐపీఎల్​ గురించి నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. కోటికి పైగా ముచ్చట్లు ఈ సీజన్​ చుట్టూనే నడిచాయి. వ్యక్తుల్లో కోహ్లీ, జట్లలో ముంబయి ఇండియన్స్ తొలి స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, చెన్నై సూపర్​ కింగ్స్​ గురించి మాట్లాడుకున్నారని ఫేస్​బుక్​ సంస్థ వెల్లడించింది.

మరిన్ని విశేషాలు..

  • ఐపీఎల్​ పదమూడో సీజన్​ గురించి కోటికి పైగా ప్రస్తావనలు వచ్చాయి. దీని గురించి చర్చించుకున్న వారిలో 74 శాతం మంది 18-34 ఏళ్ల వయసు గలవారే.
  • ఆటగాళ్లలో కోహ్లీ గురించి ఫేస్​బుక్​లో ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై సారథి ధోనీ, ముంబయి సారథి రోహిత్​ శర్మ నిలిచారు.
  • ఉత్తర్​ ప్రదేశ్​, బంగాల్​, కర్ణాటక, బిహార్​ రాష్ట్రాల్లో ఐపీఎల్​ గురించి ఎక్కువగా ప్రస్తావనలు వచ్చినట్లు ఫేస్​బుక్​ తెలిపింది.

పెరుగుతున్నారు..

ఫేస్​బుక్​తోపాటు దాని అనుబంధ సంస్థలైన వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ వేదికలుగాను ఐపీఎల్​పై చర్చలు నడిచాయని చెప్పారు ఫేస్​బుక్​ ఇండియా డైరెక్టర్​ మనీశ్​ చోప్రా.

దుబాయ్​ వేదికగా నవంబరు 10న జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్​పై గెలిచి ఐదోసారి టైటిల్​ను ముద్దాడిన జట్టుగా నిలిచింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.