ETV Bharat / sports

గేల్​​తో ధోనీ మైండ్ గేమ్స్ ఆడతాడు: ప్రజ్ఞాన్ ఓజా

పంజాబ్​తో మ్యాచ్​ కోసం చెన్నై కెప్టెన్ ధోనీ, ప్రత్యేక ప్లాన్స్​తో బరిలోకి దిగుతాడని మాజీ స్పిన్నర్ ఓజా చెప్పాడు. గేల్​ మైండ్​తో మహీ గేమ్స్​ ఆడొచ్చని అభిప్రాయపడ్డాడు.

author img

By

Published : Nov 1, 2020, 2:32 PM IST

MS Dhoni will try to play mindgames with Chris Gayle
ధోనీ

కెప్టెన్​గా ధోనీ విభిన్న ఆలోచనలు చేస్తాడని, తద్వారా తనకు కావాల్సిన ఫలితాన్ని సాధిస్తాడని భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా వెల్లడించాడు. పంజాబ్​-చెన్నై జట్ల చివరి ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ఆదివారం​ జరగనున్న నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు.

టోర్నీ ఫ్లేఆఫ్స్​ నుంచి ఇప్పటికే చెన్నై తప్పుకోగా, పంజాబ్ చివరి అవకాశం కోసం పోరాడనుంది. అయితే కింగ్స్ ఎలెవన్ జట్టులో గేల్​, కేఎల్ రాహుల్ కోసం ధోనీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసే ఉంటాడని ఓజా అభిప్రాయపడ్డాడు.

Chris Gayle
క్రిస్ గేల్

"గేల్​ను ఔట్ చేయాలని ధోనీ అనుకోడు. భిన్నమైన ప్లాన్ వేస్తాడు. పంజాబ్​ జట్టులో మిగిలిన బ్యాట్స్​మెన్​కు స్ట్రైకింగ్ వచ్చేలా చేసి గేల్​పై ఒత్తిడి పెంచుతాడు. దీంతో గేల్ ఫ్రస్టేషన్​కు గురై స్వీయ తప్పిదం చేయొచ్చు. ఎవరైనా ప్లేయర్ బాగా ఆడుతుంటే, అతడి మైండ్​తో గేమ్స్​ ఆడాలనుకుంటాడు ధోనీ. నాకు తెలిసి ఇదే సరైన వ్యూహం" -ప్రజ్ఞాన్ ఓజా, మాజీ స్పిన్నర్

ఎవరి ఊహకు అందని వ్యూహాలతో ప్రత్యర్థి జట్టును ధోనీ తికమక పెడతాడని​ చెప్పిన ఓజా.. మహీ సారథ్యంలోని తన అనుభవాల్ని పంచుకున్నాడు.

"ఫామ్​లో ఉన్న క్రికెటర్​ను మైదానంలో ఉన్నాసరే స్ట్రైకింగ్ రాకుండా చేస్తే, అతడికి చిరాకు వస్తుంది. అప్పుడు ఔటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో వైవిధ్యమైన ప్లాన్స్​ను ధోనీ అమలు చేశాడు" అని ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.