రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ 109కే పరిమితమైంది. బౌలర్లలో కాట్రెల్(2) రవి బిష్ణోయ్(3) మహ్మద్ షమీ(1) మురుగన్ అశ్విన్(3), గ్లెన్ మ్యాక్స్‌వెల్(1) వికెట్లు తీశారు. పంజాబ్ జట్టు విజయంలో సారథి కేఎల్ రాహుల్(132) శతకంతో మెరిసి.. ఈ ఇన్నింగ్స్‌ను వన్ మ్యాన్ షోగా నడిపించాడు. మయాంక్ అగర్వాల్(26), నికోలస్ పూరన్(17) పర్వాలేదనిపిచ్చారు.
ఆర్సీబీపై పంజాబ్ విజయం - KOHLI NEW RECORD IN IPL
23:03 September 24
22:49 September 24
బెంగళూరు ఓటమికి చేరువలో ఉంది. ప్రస్తుతం 15.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. విజయానికి 28 బంతుల్లో 106 పరుగులు కావాలి.
22:16 September 24
బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్.. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసి కష్టాల్లో ఉంది కోహ్లీసేన. విజయానికి 70 బంతుల్లో 150 పరుగులు కావాలి.
22:12 September 24
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. క్రీజులో డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ప్రస్తుతం 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 53 పరుగులు చేసింది కోహ్లీసేన.
21:47 September 24
కెప్టెన్ కోహ్లీ కూడా ఒక పరుగే చేసి కాట్రెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్, ఫించ్ ఉన్నారు. మూడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఐదు పరుగులు చేసింది బెంగళూరు జట్టు.
21:39 September 24
భారీ లక్ష్య ఛేదనను ప్రారంభించింది బెంగళూరు జట్టు. గత మ్యాచ్‌లో అర్థ శతకంతో ఆకట్టుకున్న దేవ్‌దత్.. తొలి ఓవర్లోనే కేవలం ఒక పరుగే చేసి ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లో జోష్ ఫిలిప్పి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 4 పరుగులు చేసింది కోహ్లీసేన. క్రీజులో ఫించ్, కోహ్లీ ఉన్నారు.
21:12 September 24
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విజృంభించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి, 69 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది పంజాబ్ జట్టు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్ 26, నికోలస్ పూరన్ 17, మ్యాక్స్‌వెల్ 5, కరుణ్ నాయర్ 15 కొట్టారు. బెంగళూరు బౌలర్లలో శివమ్ దూబే 2, చాహల్ ఓ వికెట్ తీశారు.
21:01 September 24
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. ఐదు పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్ శివమ్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రాహుల్, కరుణ్ నాయర్ ఉన్నారు. 17 ఓవర్లలో ప్రస్తుతం 146 పరుగులు చేసింది.
20:41 September 24
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసి శివం దూబే బౌలింగ్‌లో వెనుదిరిగాడు నికోలస్ పూరన్. 13.1 ఓవర్లకు పంజాబ్ 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.
20:31 September 24
రాహుల్ అర్ధసెంచరీ..
పంజాబ్ ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ చేశాడు. 36 బంతుల్లోనే మైలురాయిని అందుకున్నాడు. 12 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు /1
20:28 September 24
11 ఓవర్లకు పంజాబ్ స్కోరు 95/1
బెంగళూరుతో మ్యాచ్‌లో పంజాబ్ జట్టు చెలరేగి ఆడుతోంది. రాహుల్, నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడుతున్నారు. 11 ఓవర్లకు జట్టు స్కోరు 95/1.
20:07 September 24
పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఏడు ఓవర్లకు 57 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్, పూరన్ ఉన్నారు.
19:50 September 24
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి కోల్పోకుండా 41 పరుగులు చేసింది. మయాంక్, రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నారు.
19:31 September 24
పంజాబ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.
18:59 September 24
టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
జట్లు
బెంగళూరు: దేవ్‌దత్ పడిక్కల్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, శివమ్ దూబే, జోష్ ఫిలిప్పి, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, స్టెయిన్, చాహల్
పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నీషమ్, మహమ్మద్ షమి, మురుగన్ అశ్విన్, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్
18:17 September 24
తొలి బ్యాట్స్‌మన్ కోహ్లీనే అవుతాడు!
దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య గురవారం మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి కోహ్లీసేన ఉత్సాహంతో ఉండగా, అనుహ్య రీతిలో తొలి మ్యాచ్ చేజార్చుకున్న పంజాబ్.. ఈసారి ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఉంది. మరో 74 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5500 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టిస్తాడు ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ. భారతకాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది.