ETV Bharat / sports

ఐపీఎల్: కసితో ముంబయి.. రసెల్ అండతో కేకేఆర్​! - KKR vs MI match preview

అబుదాబి వేదికగా కోల్​కతా నైట్​ రైడర్స్​-ముంబయి ఇండియన్స్​ మధ్య నేడు(సెప్టెంబరు 23) మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు​ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్​లో ఓటమిపాలైన ముంబయి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. ఈ సీజన్​లో తన తొలి మ్యాచ్​ ఆడుతున్న కోల్​కతా ఆరంభం అదిరిపోవాలని భావిస్తోంది.

kolkata knigh riders
కోల్​కతా నైట్​ రైడర్స్​
author img

By

Published : Sep 23, 2020, 5:28 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్.. 2012, 2014 సీజన్లలో విజేతగా నిలిచి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. గతేడాది దినేశ్ కార్తీక్ సారథ్యంలో బరిలో దిగిన ఈ జట్టు​ ఐదో స్థానంతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్​కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి వేలంలో ప్యాట్​ కమిన్స్​ను రికార్డు ధరకు కొనుగోలు చేసిన ఈ జట్టు అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్​ తమ తొలి మ్యాచ్​లో చెన్నై జట్టుపై పరాజయాన్ని మూటగట్టుకున్న ముంబయి ఇండియన్స్​తో నేడు తలపడనుంది కేకేఆర్. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు, బలహీనతలు ఏంటి? జట్టులోని కీలక ఆటగాళ్లు ఎవరు? అనే విషయాలు తెలుసుకుందాం.

ఆల్​రౌండర్లే కోల్​కతా బలం

సునీల్ నరేన్, ఆండ్రూ రసెల్.. వీరిద్దరూ ఐపీఎల్​లో అత్యుత్తమ ఆల్​రౌండర్లు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి వల్ల జట్టులో సమతుల్యం ఏర్పడి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్​ బలంగా మారుతుంది. తాజాగా జరిగిన కరీబియన్ లీగ్​లోనూ సత్తాచాటాడు నరేన్. రసెల్​ గత సీజన్​లో జట్టుకు కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఒక ఓవర్​తోనే మ్యాచ్ గమనాన్నే మార్చే సామర్థ్యం ఇతడి సొంతం. వీరి తర్వాత ఆప్షన్ క్రిస్ గ్రీన్, ఈసారి వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ప్యాట్ కమిన్స్​ రూపంలో మరో ఇద్దరు ఆల్​రౌండర్లు జట్టుకు దొరికారు. భారత యువ ఆటగాడు కమలేశ్ నాగర్​కోటి కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.

పసలేని బ్యాటింగ్ లైనప్

జట్టులో నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా బ్యాటింగ్ లైనప్ మాత్రం కాస్త బలహీనంగా ఉంది. కెప్టెన్​ దినేశ్ కార్తీక్ ఫినిషర్​ పాత్ర పోషిస్తున్నా.. ఇతడి తర్వాత శుభ్​మన్ గిల్, నితీశ్ రానా మాత్రమే చెప్పుకోదగ్గ ఆటగాళ్లుగా కనిపిస్తున్నారు. క్రిస్ లిన్, రాబిన్ ఉతప్పను వదులుకున్న ఫ్రాంచైజీ ఇపుడు గిల్, రానాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. రింకూ సింగ్, సిద్దేశ్ లాడ్, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ రూపంలో ఆప్షన్స్​ కనిపిస్తున్నా వీరికి ఐపీఎల్ అనుభవం తక్కువే.

ముంబయి ఇండియన్స్​

ఆరంభమ్యాచ్​లో చెన్నై జట్టుతో దీటుగా పోరాడి.. అనూహ్య రీతిలో ఓటమిని మూటగట్టుకుంది ముంబయి ఇండియన్స్​. అయితే 2013 నుంచి జట్టును పరిశీలిస్తే.. తొలిమ్యాచ్​ను ఓటమితో ప్రారంభించి తర్వాతి మ్యాచుల్లో విజృంభించడం ముంబయికి ఆనవాయితీగా మారింది. మరి ఈ సెంటిమెంట్​ కేకేఆర్​తో జరగబోయే మ్యాచ్​లో ఫలించి.. కోల్​కతాను మట్టికరిపిస్తుందో లేదో చూడాలి.

ఈ జట్టుకు ప్రధాన బలం సారథి రోహిత్ శర్మ, బౌలర్​ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య. అయితే గత మ్యాచ్​లో బుమ్రా బాగా రాణించినప్పటికీ, రోహిత్​ పర్వాలేదనిపించాడు. కానీ హార్దిక్​ మాత్రం తేలిపాయాడు. ఏదేమైనప్పటికీ గత మ్యాచ్​లో తమ ఓటమికి కారణమైన లోపాలను సరిదిద్దుకుని కేకేఆర్​తో పోరుకు దిగుతామని చెప్పాడు రోహిత్​.

కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్​ : దినేశ్ కార్తీక్ (సారథి), మోర్గాన్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, శుభ్​మన్ గిల్, సిద్ధేష్ లాడ్, అలీ ఖాన్, కమలేష్ నాగర్‌కోటి, కుల్దీప్ యాదవ్, ఫెర్గుసన్, పాట్ కమ్మిన్స్, ప్రసీద్ మావి, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసెల్​, క్రిస్ గ్రీన్, ఎం సిద్ధార్థ్, సునీల్ నరేన్, నిఖిల్ నాయక్, టామ్ బాంటన్.

ముంబయి ఇండియన్స్ స్క్వాడ్​ : రోహిత్ శర్మ (సారథి), ఆదిత్య తారే, అన్మోల్‌ప్రీత్ సింగ్, అనుకుల్ రాయ్, క్రిస్ లిన్, ధావల్ కులకర్ణి, దిగ్విజయ్ దేశ్ ముఖ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, జేమ్స్ ప్యాటిన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా , మొహ్సిన్ ఖాన్, నాథన్ కల్టర్​నీల్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, క్వింటన్ డికాక్, రాహుల్ చాహర్, సౌరభ్ తివారీ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్.

ఇదీ చూడండి ఐపీఎల్: చెన్నై-ముంబయి పోరుకు రికార్డు వ్యూస్​​

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.