ETV Bharat / sports

దిల్లీ టైటిల్ కొడుతుందని కోల్​కతా క్రికెటర్ జోస్యం - బ్యాటింగ్​ ఆర్డర్​పై మోర్గాన్​

దిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ అందుకుంటుందని కోల్​కతా నైట్​రైడర్స్ బ్యాట్స్​మన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టులో బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను బాగా కట్టడి చేస్తున్నారని చెప్పాడు.

Morgan
మోర్గాన్​
author img

By

Published : Oct 4, 2020, 1:00 PM IST

మోర్గాన్​

ఈసారి ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ విజేతగా నిలస్తుందని కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాట్స్​మన్​ ఇయాన్​ మోర్గాన్​ జోస్యం చెప్పాడు. ఆదివారం దిల్లీతో మ్యాచ్​ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచులో అతడు క్రీజులోకి వచ్చేసరికి.. 43 బంతుల్లో 113 పరుగులు చేయాలి కోల్​కతా. వచ్చిరాగానే 18 బంతుల్లో ఫోర్​, ఐదు సిక్సర్లతో మోత మోగించాడు. దీంతో ఇతడిని టాప్​ ఆర్డలో దించుంటే మరింత విజృంభించేవాడని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాను ఆరో స్థానంలో బ్యాటింగ్​ దిగడంపైనా స్పందించాడు మోర్గాన్​. తాను ఆలస్యంగా క్రీజులోకి వచ్చాననుకోవట్లేదని అన్నాడు.

top score
టాప్​ స్కోరు

"నేను క్రీజులోకి ఆలస్యంగా వచ్చానని భావించట్లేదు. మా బ్యాటింగ్​ లైనప్​లో చాలా మంది మ్యాచ్​ విన్నర్స్​ ఉన్నారు. అయినా ప్రపంచస్థాయి ఆల్​రౌండర్ ఆండ్రూ రసెల్ ఉండగా మిగతా ఆటగాళ్లు టాప్​ ఆర్డర్​లో బ్యాటింగ్​కు దిగడం కష్టం. దిల్లీ జట్టు విషయానికొస్తే బౌలర్లు బాగా కట్టడి చేశారు. ఈ సీజన్​లో వారే ట్రోఫీని అందుకునే అవకాశాలు ఉన్నాయి"

-మోర్గాన్​, కోల్​కతా బ్యాట్స్​మన్​

"నరైన్ ఓ ప్రత్యేక ఆటగాడు. ఎప్పుడూ సానుకూల దృక్ఫథంతోనే ఉంటాడు. గతంలో చాలాసార్లు జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పడు అద్భుతంగా ఆడి ఆటనే మార్చేశాడు. గతసీజన్లలో అతడి గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయలేము" అని మోర్గాన్ అన్నాడు. ​

షార్జాలో జరిగిన మ్యాచ్​లో కోల్​కతాపై దిల్లీ​ 18 పరుగులు తేడాతో గెలిచింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్​కతా 8 వికెట్లు కోల్పోయి 210కే పరిమితమైంది. నితీశ్‌ రాణా(58) అర్థశతకం చేయగా.. ఆఖర్లో ఇయాన్‌ మోర్గాన్‌(44), రాహుల్‌ త్రిపాఠి(36) మెరుపులు వృథా అయింది. బౌలర్లు నోర్ట్జ్(3/33), హర్షల్‌ పటేల్‌(2/34) వల్ల దిల్లీ గెలిచింది.

అంతకుముందు దిల్లీ బ్యాటింగ్​లో శ్రేయస్‌ అయ్యర్‌ (88), పృథ్వీ షా(66), పంత్​(38) కీలక పాత్ర పోషించారు. మిగతా బౌలర్లు కగిసొ రబడా, అమిత్​ మిశ్రా, స్టొయినిస్​ తలో వికెట్​ తీశారు.

points table
పాయింట్ల టేబుల్​

ఇదీ చూడండి అదరగొట్టిన దిల్లీ.. మోర్గాన్‌ పోరాటం వృథా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.