కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయని ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది కోల్‌కతా. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు హస్సీ.
"చాలా మ్యాచ్‌ల్లో ఓడిపోవడం వల్లే ఐదో స్థానంలో ఉన్నాం. ఈ పరాజయానికి కారకులం మేమే. కానీ, ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పై గెలిచి తీరుతాం."
-డేవిడ్ హస్సీ, కోల్‌కతా మెంటార్.
'అద్భుతాలు జరగొచ్చు'
ఫలితం తమకు అనుకూలంగానే వస్తుందని, ప్లే ఆఫ్స్‌లో ఇతర జట్లకు షాక్ ఇస్తామని డేవిడ్ హస్సీ వెల్లడించాడు. ఎప్పుడైనా అద్భుతాలు జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓటమి చాలా కష్టంగా ఉంటుందని పేర్కొన్నాడు.
గురువారం జరిగిన మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కోల్‌కతాను ఓడించింది ధోనీసేన. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: అలా చేస్తే ఆశ్చర్యపడను: గంభీర్