ETV Bharat / sports

బుమ్రాపై ఒత్తిడి తగ్గించాలి: ఆకాశ్ - akash chopra about bumrah bowling

ముంబయి ఇండియన్స్ బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా ఐపీఎల్​లో కఠినమైన ఓవర్లలోనే బౌలింగ్​ చేస్తున్నాడని ఆకాశ్​ చోప్రా వెల్లడించాడు. అతనికి కొంచెం తేలికైన ఓవర్లు​ ఇచ్చి.. ఒత్తిడి తగ్గించాలని సూచించాడు.

Jasprit Bumrah
బుమ్రా
author img

By

Published : Oct 1, 2020, 3:23 PM IST

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ బౌలర్​ జస్ప్రీత్ బుమ్రాకు కఠినమైన ఓవర్లు ఇస్తున్నారని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​, వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే అతనిపై ఒత్తిడి తగ్గించేందుకు తేలికైన ఓవర్లు ఇస్తే బాగుంటుందని సూచించాడు. గురువారం పంజాబ్​తో ముంబయి తలపడనున్న నేపథ్యంలో.. యూట్యూబ్​ ఛానెల్​ వేదికగా ఆకాశ్​ మ్యాచ్​ను విశ్లేషించిన వీడియోను పోస్ట్​ చేశాడు. బౌలింగ్​ పరంగా ఉన్న సమస్యలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపాడు. ముఖ్యంగా డెత్​ బౌలింగ్​లో​ షమీకి ఎవరైనా మద్దతు ఇవ్వకపోతే జట్టుకే నష్టమని ​ పేర్కొన్నాడు.

Jasprit Bumrah
బుమ్రా

"పంజాబ్​ జట్టు బౌలింగ్​లో సమస్యలు ఉన్నాయి. కాట్రెల్​, నీషమ్​ డెత్​ బౌలింగ్​కు సరైన వ్యక్తులు కాదు. షమీ మాత్రమే అందుకు సరైన బౌలర్​. అంతే కాదు, నీషమ్​ స్థానంలో ముజిబుర్​ రెహ్మన్​ను ఎంచుకుంటే బాగుంటుంది. కాట్రెల్​ స్థానంలో విల్జోయెన్​ లేదా క్రిస్​ జోర్డాన్​లను తీసుకుంటే జట్టుకు బలం చేకూరుతుంది."

-ఆకాశ్​ చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

ముంబయి ఇండియన్స్ జట్టులో జేమ్స్​ పాటిన్సన్​కు బదులు నాథన్​ కౌల్టర్​నీల్​ను బరిలోకి దింపాలని ఆకాశ్​ సూచించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.