ETV Bharat / sports

చెన్నైపై కొనసాగుతోన్న ముంబయి ఆధిపత్యం - చెన్నైపై ముంబయిదే హవా

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​ ద్వారా చెన్నైపై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఇప్పటివరకు సీఎస్కేపై ముంబయి పేరిట ఉన్న రికార్డులేంటో చూద్దాం.

Mumbai Indians continues to dominate Chennai Super Kings
చెన్నైపై కొనసాగుతోన్న ముంబయి ఆధిపత్యం
author img

By

Published : Oct 24, 2020, 11:02 AM IST

Updated : Oct 24, 2020, 2:47 PM IST

శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొంది రన్​రేట్​ను మరింత మెరుగుపర్చుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​లో ఓడిన సీఎస్కే దాదాపు ప్లేఆఫ్స్​ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్​ ద్వారా ముంబయి.. చెన్నైపై ఉన్న తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది. అవేంటో చూద్దాం.

ఈ మ్యాచ్​లో ముంబయి 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్కేను 10 వికెట్ల తేడాతో ఓడించిన ఒకే ఒక జట్టుగా నిలిచింది. అలాగే ధోనీసేనను 100 పరుగుల లోపే కట్టడి చేసిన ఏకైక జట్టు కూడా ముంబయి కావడం గమనార్హం. 2013లో ముంబయి బౌలర్ల ధాటికి చెన్నై 79 పరుగులకే కుప్పకూలింది.

Mumbai Indians continues to dominate Chennai Super Kings
చెన్నై-ముంబయి

ముంబయిదే ఆధిపత్యం

చెన్నై-ముంబయి మధ్య జరిగిన మ్యాచ్​ల్లో ముంబయి హవా కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి 11 మ్యాచ్​ల్లో ముంబయి 9 సార్లు విజయం సాధించింది. సీఎస్కే కేవలం రెండు సార్లు మాత్రమే గెలుపొందింది.

సీఎస్కే

చెన్నైపై రికార్డు ఛేదన

అలాగే ఛేదనలో తక్కువ ఓవర్లలో సీఎస్కేను ఓడించిన జట్టుగా కూడా ముంబయి రికార్డు నెలకొల్పింది. నిన్న జరిగిన మ్యాచ్​లో 12.2 ఓవర్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది ముంబయి. ఇంతకుముందు ఈ రికార్డు దిల్లీ డేర్ డెవిల్స్ పేరిట ఉండేది. 2012లో చెన్నై విధించిన లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో చేధించింది దిల్లీ.

ముంబయి

Last Updated : Oct 24, 2020, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.