ETV Bharat / sports

రాజస్థాన్​ vs హైదరాబాద్​: ఫ్లే ఆఫ్స్​కు చేరాలంటే గెలవాల్సిందే

author img

By

Published : Oct 22, 2020, 5:31 AM IST

టోర్నీలో చెరో ఆరు మ్యాచ్​ల్లో ఓడిన రాజస్థాన్, హైదరాబాద్​.. దుబాయ్ వేదికగా నేడు(అక్టోబరు 22) తలపడనున్నాయి. ఈ మ్యాచ్​ ఇరుజట్లకు ఎంతో కీలకం. ఎందుకంటే ఓడిన వాళ్ల ప్లేఆఫ్ ఆశలు గల్లంతైనట్లే! భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

IPL PREVIEW, RR Vs SRH: Strugglers RR and SRH lock horns in must-win game
రాజస్థాన్​ vs హైదరాబాద్​: ఇరుజట్లకు ఈ మ్యాచ్​ కీలకం

ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టాలంటే ఈ మ్యాచ్​లో కచ్చితంగా గెలవాల్సిందే. గురువారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగే ఈ పోరులో సన్​రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. మరి ఎవరు ముందడగు వేస్తారో చూడాలి?

బ్యాట్స్​మెన్​ వైఫల్యం

గత మ్యాచ్​లో చెన్నైపై గెలిచి, నాకౌట్​ ఆశల్ని సజీవం చేసుకుంది రాజస్థాన్. ఆ పోరులో​ 70 పరుగులు చేసిన బట్లర్​కు సహకరమందించడంలో మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. ​స్టోక్స్, ఉతప్ప​ అంతంత మాత్రంగానే రాణిస్తుండగా.. యువ బ్యాట్స్​మన్ సంజూ శాంసన్​ బ్యాటింగ్​లో విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్​ సమస్య కూడా రాజస్థాన్​ను వెంటాడుతోంది. ​

బౌలింగ్​​లో ఆర్చర్​, శ్రేయస్​ గోపాల్​, రాహుల్​ తెవాతియా, కార్తిక్​ త్యాగి మంచి ప్రదర్శన చేస్తున్నారు. బెన్​స్టోక్స్​కు గత మ్యాచ్​లో గాయమైంది. సన్​రైజర్స్​తో జరిగే మ్యాచ్​లో బౌలింగ్​ చేసే అవకాశం లేకపోవచ్చు.

బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ..

గతమ్యాచ్​లో కోల్​కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. సూపర్ ​ఓవర్​కు దారితీసిన ఈ పోరులో మోర్గాన్​సేన విజయం సాధించింది. అయితే రాజస్థాన్​పై గెలిచి, ప్లేఆఫ్స్​ ఆశలు పదిలం చేసుకోవాలని వార్నర్​సేన భావిస్తోంది. ఈ జట్టులో ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో ఆకట్టుకునే బ్యాటింగ్ చేస్తుండగా.. మిడిలార్డర్​ విఫలమవుతోంది. బౌలింగ్​ కూడా ఇంకా బలపడాల్సి ఉంది.

జట్లు(అంచనా)

రాజస్థాన్​​: బట్లర్​, స్టోక్స్​, సంజూ శాంసన్​, కార్తిక్​ త్యాగి, స్మిత్​ (కెప్టెన్​), శ్రేయస్​ గోపాల్​, రాహుల్​ తెవాతియా, జయదేవ్​ ఉనద్కత్, రియాన్​ పరాగ్​, రాబిన్​ ఉతప్ప, జోఫ్రా ఆర్చర్​

హైదరాబాద్​: డేవిడ్​ వార్నర్​ (కెప్టెన్​), బెయిర్​స్టో, విలియమ్సన్​, మనీశ్​ పాండే, ప్రియమ్​ గార్గ్​, విజయ్ శంకర్, అబ్దుల్​ సమద్​, రషీద్ ఖాన్​, ఖలీల్​ అహ్మద్​, సందీప్​ శర్మ, నటరాజన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.