ETV Bharat / sports

సన్​రైజర్స్ హైదరాబాద్​ ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టేనా?

మంగళవారం(నవంబరు 3) జరిగే మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

IPL PREVIEW
ముంబయి ఇండియన్స్​ సన్​రైజర్స్​
author img

By

Published : Nov 3, 2020, 5:31 AM IST

Updated : Nov 3, 2020, 6:29 AM IST

ఇప్పటికే ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించిన ముంబయి ఇండియన్స్​తో సన్​రైజర్స్​ హైదరాబాద్ తలపడేందుకు సిద్ధమవుతోంది​. షార్జా వేదికగా మంగళవారం జరిగే ఈ పోరులో గెలిచి, ప్లేఆఫ్స్​లో చోటు దక్కించుకోవాలని వార్నర్​సేన భావిస్తోంది. మరి ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో?

మరో మెట్టు పైకి ఎక్కుతుందా?

పాయింట్ల పట్టికలో హైదరాబాద్​ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. గత రెండు మ్యాచుల్లో గెలిచి జోష్​తో ఉందీ జట్టు. సారథి వార్నర్, సాహా ఓపెనింగ్​ భాగస్వామ్యం అదరగొడుతోంది. ఆల్​రౌండర్​ హోల్డర్​ జట్టుకు బాగా సహకరిస్తున్నాడు. బౌలింగ్​ విభాగంలో రషీద్​ ఖాన్​, నటరాజన్​, సందీప్​ శర్మ, హోల్డర్​తో బలంగా ఉంది. ముంబయితో జరిగే మ్యాచ్​లో గెలిస్తే.. నెట్ రన్​రేట్​ ఆధారంగా ప్లే ఆఫ్స్​లో అడుగుపెట్టే అవకాశముంది. మరి వార్నర్​సేన ఎలా ఆడుతుందో చూడాలి.

జట్టు బలంగా ఉంది

ఐదో టైటిల్​పై కన్నేసిన ముంబయి..​ పూర్తి పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించి మంచి దూకుడు మీద ఉంది. సన్​రైజర్స్​తో మ్యాచ్​లోనూ రోహిత్ లేకుండానే బరిలో దిగునుంది. అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా ఉన్న పొలార్డ్​ బాగానే ఆడుతున్నాడు. ఇషాన్​ కిషన్​, డి కాక్​, సూర్యకుమార్​ యాదవ్​ లాంటి ఆటగాళ్లతో బ్యాటింగ్​ విభాగం బలంగా ఉంది. ఆల్​రౌండర్లు హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య బాగా రాణిస్తున్నారు. బౌలర్లు ​బౌల్ట్​, బుమ్రా సహకారం తోడవ్వడం జట్టుకు బాగా కలిసి వస్తోంది. మొత్తంగా సమష్టి ప్రదర్శనతో మంచి ప్రదర్శన చేస్తోంది రోహిత్​ సేన.

జట్లు (అంచనా)

ముంబయి: డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్య, పొలార్డ్ (కెప్టెన్), కౌల్టర్​నీల్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, బౌల్ట్, బుమ్రా

హైదరాబాద్: డేవిడ్​ వార్నర్​ (కెప్టెన్​), సాహా, విలియమ్సన్​, మనీశ్​ పాండే, ప్రియమ్​ గార్గ్​, విజయ్ శంకర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ఖలీల్​ అహ్మద్​, సందీప్​ శర్మ, నటరాజన్​

ఇదీ చూడండి ఛేదనలో మాదీ మేటి జట్టే: డేవిడ్ వార్నర్

Last Updated : Nov 3, 2020, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.