ETV Bharat / sports

ముంబయి X పంజాబ్​: మెరుపులు మెరిపించేదెవరు?

author img

By

Published : Oct 1, 2020, 5:30 AM IST

అబుదాబి వేదికగా గురువారం పంజాబ్​తో ముంబయి జట్టు​​ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

MI, KXIP
పంజాబ్​ vs ముంబయి

ఐపీఎల్​లో అత్యంత ఆకర్షణీయ ఫ్రాంచైజీల్లో ముంబయి ఇండియన్స్​ ఒకటి. ఈ సీజన్​లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్​ల్లో ఒక్కసారే గెలిచి, అభిమానులను నిరాశపరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్​.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పుడీ రెండు జట్లు, అబుదాబి వేదికగా గురువారం తలపడనున్నాయి. తమపై అంచనాలు పెట్టుకున్న అభిమానుల కల నెరవేర్చాలని ముంబయి.. ఎలాగైనా ఫైనల్​కు చేరాలనే తపనతో పంజాబ్​ పట్టుదలతో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

వ్యూహం ఫలించేనా?

చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్​లో ఓటమి చవిచూసిన ముంబయి.. ఆ తర్వాత కోల్​కతాపై ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్​లో చివరివరకు పోరాడి.. సూపర్​ ఓవర్​లో బెంగళూరు జట్టుకు తలవంచక తప్పలేదు. కెప్టెన్ రోహిత్​ శర్మ, డికాక్​, ఇషాన్​ కిషన్​, హార్దిక్​ పాండ్య లాంటి స్టార్​ బ్యాట్స్​మెన్​తో జట్టు బలంగా ఉంది. బౌలింగ్​ విభాగంలో బుమ్రా, బౌల్ట్​, ప్యాటిన్సన్​, రాహుల్ చాహర్​ల అండదండలున్నాయి. మరి పంజాబ్​తో మ్యాచ్​లో రోహిత్​ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.

గెలుపు దక్కేనా?

సూపర్​ ఓవర్​లో దిల్లీ చేతిలో పరాభవం పొందిన పంజాబ్​.. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ దూకుడైన బ్యాటింగ్​తో రెండో మ్యాచ్​లో బెంగళూరును చిత్తుగా ఓడించింది. రాజస్థాన్​ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్​, తెవాతియా అద్భుత ప్రదర్శనతో మూడో మ్యాచ్​ను చేజార్చుకుంది. జట్టులో కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​, పూరన్​ లాంటి స్టార్​ బ్యాట్స్​మన్​ బలం. మరోవైపు బిష్ణోయ్​, షమి లాంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. తర్వాత మ్యాచ్​లో గెలుపు దక్కించుకుంటారో లేదా తెలియాల్సి ఉంది. ​

పంజాబ్:

మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), పూరన్, మ్యాక్స్​వెల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమి, కాట్రెల్

ముంబయి:

డికాక్, రోహిత్ శర్మ(కెప్టెన్​), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, ప్యాటిన్సన్, బౌల్ట్, బుమ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.