తొలి మ్యాచ్‌తో బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తర్వాతి పోరులో పంజాబ్ చేతిలో ఘోరంగా ఓడింది. ముంబయి ఇండియన్స్.. చెన్నైపై ఓడినా, పుంజుకుని.. కోల్‌కతాపై అద్భుత విజయం సాధించింది. ఇప్పుడీ రెండు జట్లు సోమవారం మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడనున్నాయి. తమపై వస్తున్న విమర్శలకు చెక్‌పెట్టాలని కోహ్లీ సేన, విజయాన్ని కొనసాగించాలని రోహిత్ సేన పట్టుదలతో ఉన్నాయి. కచ్చితమైన వ్యూహాలు అమలు చేసి, పాయింట్లు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
బెంగళూరు జట్టు
తొలిమ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి మారినట్టే కనిపించింది. ఆ తర్వాత మ్యాచ్‌లో పంజాబ్‌పై ఊహించలేనంత ఘోరంగా విఫలమైంది. కనీసం పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(132) చేసిన వ్యక్తిగత స్కోరు కూడా దాటలేకపోయింది. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఫించ్, డివిలియర్స్, కోహ్లీతో పాటు అందరూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లోనైనా తమ ప్రదర్శన మార్చుకుని, గెలుపు రుచిచూడాలని భావిస్తున్నారు.
ముంబయి ఇండియన్స్
తొలి మ్యాచ్‌లో చెన్నై జట్టుపై ఓడి, అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కసిగా ఆడి అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(80) అద్భుతమైన బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. సౌరభ్ తివారి, సూర్య కుమార్ యాదవ్ బాగానే ఆడారు. బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడిదే జోష్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే ముంబయి గెలవడం కష్టమేమి కాదు.
జట్టు అంచనాలు
బెంగళూరు:
దేవ్‌దత్ పడిక్కల్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, శివమ్ దూబే, జోష్ ఫిలిప్పి, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, స్టెయిన్, చాహల్
ముంబయి:
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
ఇదీ చూడండి చెన్నై ట్విట్టర్‌ను రైనా అన్‌ఫాలో చేశాడా?