ETV Bharat / sports

కోల్​కతా జట్టుపై ముంబయి విజయం

author img

By

Published : Oct 16, 2020, 6:46 PM IST

Updated : Oct 16, 2020, 10:48 PM IST

Mumbai indians vs Kolkata knight riders
ముంబయి ఇండియన్స్ కోల్​కతా నైట్​రైడర్స్

22:46 October 16

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా జట్టుపై ముంబయి గెలిచింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఓపెనర్ డికాక్(78) గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

22:37 October 16

ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్న ముంబయి ఇండియన్స్.. విజయానికి చేరువైంది. ప్రస్తుతం 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేశారు. క్రీజులో డికాక్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.

22:09 October 16

ముంబయి ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ ధనాధనా బ్యాటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు వికెట్లేమి నష్టపోకుండా 90 పరుగులు చేసింది ముంబయి. విజయానికి 10 ఓవర్లలో మరో 59 పరుగులు మాత్రమే కావాలి.

21:45 October 16

149 పరుగుల లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించింది ముంబయి. ఓపెనర్లు డికాక్, రోహిత్.. ఎడాపెడా బౌండరీలు బాదుతున్నారు. దీంతో 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 48 పరుగులు చేసింది.

21:07 October 16

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్​కతా బ్యాట్స్​మెన్ అందరూ తడబడ్డారు. స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేయగలిగింది. బౌలర్ కమిన్స్(53*), కెప్టెన్ మోర్గాన్(39*) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ 2, బుమ్రా, కౌల్టర్​నైల్, బౌల్ట్ తలో వికెట్ తీశారు.

20:36 October 16

కోల్​కతా నైట్​రైడర్స్ చాలా నిదానంగా బ్యాటింగ్ చేస్తోంది. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మోర్గాన్, కమిన్స్ ఉన్నారు.

20:21 October 16

కోల్​కతా నెమ్మదిగా ఆడుతోంది. పది ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 57పరుగులు చేసింది. క్రీజులో రసెల్​(8), మోర్గాన్​(7) ఉన్నారు. 

19:57 October 16

మూడో వికెట్​ కోల్పోయింది కోల్​కతా. శుభ్​మన్ గిల్​(21) రాహుల్​ చాహర్​ బౌలింగ్​లో కీరన్​ పొలార్డ్​ చేతికి క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. ప్రస్తుతం 7.4 ఓవర్లకు 42 స్కోరు చేసింది కోల్​కతా. 

19:53 October 16

రెండో వికెట్​ కోల్పోయింది కోల్​కతా. నితీశ్​ రానా(5) పరుగులే చేశాడు. 5.3 ఓవర్లకు స్కోరు  33గా ఉంది. క్రీజులో శుభమన్ గిల్​(17), దినేశ్​ కార్తీక్​ వచ్చాడు. 

19:42 October 16

 కోల్​కతా తొలి వికెట్​ కోల్పోయింది. బౌల్డ్​ బౌలింగ్​లో రాహుల్​ త్రిపాఠి(7) సూర్యకుమార్​ యాదవ్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు.  మూడు ఓవర్లు ముగిశేసరికి కోల్​కతా స్కోరు 18గా ఉంది. క్రీజులో శుభమన్​ గిల్​(7), రాహల్​ స్థానంలో నితీశ్​ రానా వచ్చాడు. 

18:59 October 16

టాస్ గెలిచిన కోల్​కతా నైట్​రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్ మోర్గాన్ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబయి.. బౌలింగ్ దాడిని ప్రారంభించనుంది.

జట్లు

ముంబయి: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, బౌల్ట్, కౌల్టర్​ నైల్, బుమ్రా

కోల్​కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్​మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, క్రిస్ గ్రీన్, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ

18:34 October 16

కోల్​కతా కొత్త సారథిగా మోర్గాన్

అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడున్నరకు మొదలవుతుంది. అయితే వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొన్న దినేశ్ కార్తిక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల ఆ బాధ్యతల్ని ఇయాన్ మోర్గాన్​కు(ఇంగ్లాండ్) అప్పగించారు. ఈ విషయాన్ని మ్యాచ్​కు కొన్ని గంటల క్రితమే ఫ్రాంచైజీ వెల్లడించింది.

Last Updated : Oct 16, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.