ETV Bharat / sports

ఈసారి భారీగా పెరిగిన ఐపీఎల్​ వ్యూయర్​షిప్!

author img

By

Published : Nov 12, 2020, 2:48 PM IST

హోరాహోరీ మ్యాచ్​లు.. అనూహ్యమైన మలుపులు.. అద్భుత పోరాటాలతో ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచింది ఐపీఎల్​. కరోనా ప్రభావంతో ఈ సారి మైదానంలో ప్రేక్షకుల్ని అనుమతించని నేపథ్యంలో డిజిటల్ వ్యూయర్​షిప్ చాలా పెరిగింది.

IPL 2020 viwership record breaking 28 per cent increase in viewership
ఐపీఎల్​ 2020: వ్యూస్​తో అదరగొట్టిన ఫ్యాన్స్​

కరోనా ప్రభావంతో ఈ ఏడాది అసలు జరుగుతుందా? లేదా అనుకున్న ఐపీఎల్.. ఏకంగా థ్రిల్లర్​ సినిమాను తలపించింది. ప్రతి మ్యాచ్​ ఉత్కంఠకు గురిచేస్తూ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే వ్యూయర్​షిప్​ను పెంచుకుంది. బీసీసీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈసారి 28 శాతం వ్యూయర్​షిప్​ పెరిగింది. ఇదే సందర్భంగా సీజన్​ స్పాన్సర్​గా వ్యవహరించిన డ్రీమ్​ ఎలెవన్​ సంస్థకు ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​ ధన్యవాదాలు తెలిపారు.

ముంబయి ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్​.. డిజిటల్​గా తమ అభిమానులకు మరింత దగ్గరయ్యాయి. ఎప్పటికప్పుడు​ లైవ్​ అప్​డేట్స్​ను వారికి అందించి, లీగ్​ విజయవంతం కావడంలో తమ వంతు పాత్ర పోషించాయి.

​దుబాయ్​ వేదికగా మంగళవారం(నవంబరు 10) జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన తుదిపోరులో గెలిచి, లీగ్​ చరిత్రలోనే అత్యధికంగా ఐదోసారి టైటిల్​ను ముద్దాడింది. వచ్చే ఏప్రిల్-మే మధ్యలో టోర్నీని భారత్​లోనే నిర్వహించనున్నాట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పారు. త్వరలో మెగావేలం కూడా జరపనున్నారు.

ఇదీ చూడండి:ఈ ఐపీఎల్​.. అందరికీ ప్రియమైన లీగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.