ETV Bharat / sports

'ధోనీ సేనకు ఏమైంది? వారికి ఎందుకింత నిరాశ?' - చెన్నై సూపర్​కింగ్స్ వార్తలు

రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుపై చెన్నై సూపర్​కింగ్స్​ ఓడిపోవడం ఆ టీమ్​ అభిమానులకు మింగుడు పడటం లేదని అన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​. ప్రతి సీజన్​లో అద్భుతంగా రాణించే సీఎస్కే.. ఈ ఏడాది పేలవ ప్రదర్శనతో నిరాశ కలిస్తుందని తెలిపాడు.

IPL 2020: Virender Sehwag feels sad for CSK fans
'ఆ మ్యాచ్​లో ఓడినందుకు ఫ్యాన్స్ బాధపడుతున్నారు'
author img

By

Published : Oct 12, 2020, 4:05 PM IST

శనివారం ఐపీఎల్​ మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టును రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు ఓడించడంపై సీఎస్కే అభిమానులు నిరాశ చెందారని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​ అన్నాడు. గతంలో ధోనీ జట్టుతో మిగిలిన టీమ్​లు చాలా జాగ్రత్తగా ఆడేవని.. అయితే ఈ ఏడాది సీఎస్కే బ్యాటింగ్ ​తీరు గతంలో కంటే భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

"సీఎస్కే అభిమానులకు చాలా బాధగా ఉంది. గతంలో ఈ జట్టుతో ఆడాలంటే మిగిలిన టీమ్​లు చాలా జాగ్రత్తగా ఉండేవి. కానీ, ఈ ఏడాది ధోనీ సేన ప్రదర్శన నిరాశ కలిగిస్తుంది. శనివారం జరిగిన మ్యాచ్​లో కోహ్లీ కెప్టెన్​ ఇన్నింగ్స్​ ప్రత్యేకంగా నిలిచింది. తొలుత ఆర్సీబీ 150 పరుగులకు సరిపెట్టుకుంటుందని భావించాం. కానీ, డెత్​ ఓవర్లలోనూ స్కోరు ఎక్కువ రాబట్టవచ్చని ఈ మ్యాచ్​ ద్వారా తెలిసింది".

- వీరేంద్ర సెహ్వాగ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

టోర్నీలో సీఎస్కే ఆడిన ఏడు మ్యాచ్​ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. సీఎస్కేపై బెంగళూరు జట్టు విజయానికి విరాట్​ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్సే ప్రధాన కారణం. ఓపెనర్లు వెంటవెంటనే వెనుదిరిగినా.. కోహ్లీ చివరి వరకు క్రీజ్​లో 90 రన్స్​ చేయడమే కాకుండా సీఎస్కేకు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. ఆ తర్వాత బరిలో దిగిన సీఎస్కే బ్యాట్స్​మన్​ వరుసగా విఫలమవ్వడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేన 37 రన్స్​ తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ బౌలర్ క్రిస్​ మోరిస్​ 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి సహకరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.