ETV Bharat / sports

బ్యాటు కాదు బంతి జోరు చూపిస్తోంది! - IPL UAE BOWLERS

ఐపీఎల్ మ్యాచ్​లు జరుగుతున్న యూఏఈ మైదానాలు బ్యాట్స్​మెన్​కు కాకుండా బౌలర్లకు సహకరిస్తున్నాయి. తొలి అర్ధభాగంలో భారీ స్కోర్లు నమోదైతే, ఇప్పుడు బౌలర్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు.

ipl 2020 special story on bowlers
బ్యాటు కాదు బంతి జోరు చూపిస్తోంది!
author img

By

Published : Oct 15, 2020, 6:38 AM IST

టీ20లంటే బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం. అందులోనూ ఐపీఎల్‌ అంటే పరుగుల పండగే. ప్రస్తుత 13వ సీజన్లోనూ ఒక దశ వరకు ఇలాగే సాగింది. కానీ కానీ ఇప్పుడు కథ మారుతోంది. బ్యాట్‌ను మించి బంతి ఆధిపత్యం చలాయిస్తోంది. టోర్నీ సాగుతున్నా కొద్దీ పిచ్‌లు నెమ్మదిగా మారి.. బౌలర్ల ఆధిపత్యం సాగుతుందన్న అంచనాలు నిజమవుతున్నాయ్‌!

ఐపీఎల్‌-13లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఇన్ని రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌లు.. ఇప్పుడు బౌలర్లకు సహకరిస్తున్నాయి. సీజన్‌ తొలి అర్ధభాగం ముందు వరకూ బ్యాటింగ్‌ చేసే ప్రతి జట్టు సుమారు 200 పరుగులు చేసేలా కనిపించింది. ఛేదనలోనూ పరుగుల వరద పారింది. 200 పైచిలుకు లక్ష్యాల్ని రెండు జట్లు ఛేదించాయి.

rashid khan
హైదరాబాద్​ బౌలర్ రషీద్ ఖాన్

కానీ ఇప్పుడు నెమ్మదిగా స్పందిస్తున్న పిచ్‌లపై బౌలర్ల ఆధిపత్యం నడుస్తోంది. అబుదాబి, దుబాయ్‌, షార్జాల్లో.. ఈ మూడు వేదికల్లోనూ ఇదే పరిస్థితి. ఫ్లాట్‌ వికెట్‌, చిన్న బౌండరీలతో బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న షార్జా మైదానంలోనూ ఇప్పుడా మెరుపులు కనిపించట్లేదు.

అక్కడ జరిగిన తొలి మూడు మ్యాచ్‌లు చూస్తే.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200కు పైగా చొప్పున స్కోర్లు నమోదయ్యాయి. పంజాబ్‌తో మ్యాచ్‌లోనైతే 224 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్‌ అందుకుని సంచలనం సృష్టించింది.

అలాంటి మైదానంలో గత రెండు మ్యాచ్‌ల్లో ఛేదనలో నమోదైన స్కోర్లు వరుసగా 138, 112 మాత్రమే. ఈ మైదానంలో ఇలాంటి స్కోర్లు చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. నెమ్మదిగా మారిన పిచ్‌లపై మొదట బ్యాటింగే కష్టంగా సాగుతోంది.. ఇక ఛేదన అంటే కఠిన సవాలుగా మారుతోంది. ఈ పిచ్‌పై చివరి మ్యాచ్‌లో బెంగళూరు 194 పరుగులు చేయగా.. కోల్‌కతా 112/9కే పరిమితమైంది.

దుబాయ్‌లోనూ అలాగే ఉంది. అక్కడ జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో ఏ జట్టూ 170 పరుగులు దాటలేదు. మంగళవారం మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను 147కే కట్టడి చేసి 20 పరుగుల తేడాతో చెన్నై నెగ్గింది. తాజాగా దుబాయ్‌లో దిల్లీ-రాజస్థాన్‌ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడ్డారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 15 వికెట్లు పడ్డాయి. రాయల్స్‌ 162 పరుగుల లక్ష్యాన్నీ ఛేదించలేకపోయింది. అబుదాబిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ipl 2020 special story on bowlers
బెంగళూరు బౌలర్ సైనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.