ETV Bharat / sports

'ఓపెనర్ల బ్యాటింగ్​ మాలో విశ్వాసాన్ని నింపింది' - delhi capitals next match

శుక్రవారం జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ను ఓడించి వరుసగా రెండు విజయాన్ని ఖాతాలో వేసుకుంది దిల్లీ క్యాపిటల్స్. ఈ సందర్భంగా కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ మాట్లాడుతూ.. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్​ బ్యాటింగ్ తీరు​ తమలో విశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నాడు.

IPL 2020
శ్రేయస్​ అయ్యర్​
author img

By

Published : Sep 26, 2020, 1:03 PM IST

Updated : Sep 26, 2020, 2:08 PM IST

చెన్నై సూపర్​ కింగ్స్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే దిల్లీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​పై పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.

తొలుత బ్యాటింగ్​కు దిగిన దిల్లీ 175 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(64), శిఖర్​ ధావన్(35)​లు అద్భుత ప్రదర్శనతో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఛేదనలో చెన్నై విఫలమైంది. 44 పరుగుల తేడాతో దిల్లీ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ అద్భుత విజయం సాధించిన సందర్భంగా దిల్లీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు.

"ఈ మ్యాచ్​లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓపెనర్లు ఆడిన తీరు జట్టు సభ్యుల్లో విశ్వాసాన్ని నింపింది. ముగింపు కూడా చాలా బాగుంది. మేమంతా ఒకరి విజయాన్ని మరొకరం ఆస్వాదిస్తాం. జట్టు సమావేశంలో బ్యాటింగ్​ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తదనుగుణంగా ఆడతాం."

-శ్రేయస్ అయ్యర్​, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్

ఈ మ్యాచ్​లో అర్ధసెంచరీ సాధించిన పృథ్వీషా మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిల్లీ అగ్రస్థానంలో ఉంది. తమ తదుపరి మ్యాచ్​లో సెప్టెంబరు 29న మంగళవారం సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడనుంది.

Last Updated : Sep 26, 2020, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.