కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల లక్ష్యంలో బరిలో దిగిన రాజస్థాన్ 19.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద షమీ(3), కాట్రెల్, జేమ్స్ నీశమ్, ముర్గన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. రాజస్థాన్ విజయంలో సంజు శాంసన్(85), స్టీవ్ స్మిత్(50) , రాహుల్ తివాటియా(53) కీలక పాత్ర పోషించారు.
పంజాబ్‌పై రాజస్థాన్ విజయం
23:05 September 27
22:56 September 27
17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయం సాధించాలంటే మూడు ఓవర్లలో 51 పరుగులు చేయాలి. క్రీజులో రాహుల్ తెవాటియా, రాబిన్ ఉతప్ప ఉన్నారు.
22:45 September 27
15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది రాజస్థాన్ జట్టు. సంజూ శాంసన్ చెలరేగి ఆడుతున్నాడు.
22:22 September 27
భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే కెప్టెన్ స్మిత్.. అర్థ శతకం చేసి ఔటయ్యాడు. క్రీజులో సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా ఉన్నారు. ప్రస్తుతం 11 ఓవర్లకు 112 పరుగులు చేసింది.
21:55 September 27
పవర్‌ప్లే పూర్తయింది. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది రాజస్థాన్. విజయానికి 84 బంతుల్లో 155 పరుగులు కావాలి. క్రీజులో సంజూ శాంసన్, స్మిత్ ఉన్నారు.
21:34 September 27
224 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. 2 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్, స్మిత్ ఉన్నారు.
21:05 September 27
షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుకు 224 భారీ లక్ష్యం నిర్దేశించింది పంజాబ్. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 106, కేఎల్ రాహుల్ 69 చెలరేగడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అంకిత్, టామ్ కరన్ తలో వికెట్ తీశారు.
20:50 September 27
పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 106 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో వేగంగా 100 పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా(45 బంతులు) రికార్డు సృష్టించాడు. ఇతడి కంటే ముందు యూసఫ్ పఠాన్(37) ఉన్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 185 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు.
20:40 September 27
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు వికెట్ తీసేందుకు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(64*), మయాంక్ అగర్వాల్(100*).. చితక్కొడుతున్నారు. 15 ఓవర్లు పూరయ్యేసరికి 172 పరుగులు చేశారు.
20:15 September 27
పంజాబ్ జట్టు ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 110 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 36, మయాంక్ 69 పరుగులతో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లు వికెట్లు తీసేందుకు చాలా శ్రమిస్తున్నారు.
19:35 September 27
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.
19:00 September 27
టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది పంజాబ్. ఈ మ్యాచ్‌లోనూ గేల్‌కు అవకాశం దక్కలేదు. రాజస్థాన్ తరఫున బట్లర్ ఓపెనర్‌గా బరిలో దిగనున్నాడు.
జట్లు
రాజస్థాన్: జాస్ బట్లర్, స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఉతప్ప, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, అంకిత్ రాజ్‌పుత్
పంజాబ్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), పూరన్, మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమి, కాట్రెల్
18:34 September 27
షార్జా వేదికగా జరగనున్న మ్యాచ్
షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. గత మ్యాచ్‌ల్లో గెలిచిన ఇరుజట్ల ఇందులోనూ విజయం సాధించి, విజయపరంపరను కొనసాగించాలని చూస్తున్నాయి. మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుందీ మ్యాచ్.