5 వికెట్ల తేడాతో గెలుపు
ముంబయి ఆల్‌రౌండ్ షోతో మరోసారి అదరగొట్టింది. అబుదాబి వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేయగా.. ఛేదనలో మరో రెండు బంతులు మింగిలుండగానే రోహిత్‌సేన లక్ష్యాన్ని ఛేదించింది. ముంబయి బ్యాట్స్‌మన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.