ETV Bharat / sports

చెన్నై గెలుపు.. పంజాబ్ ఇంటిముఖం

author img

By

Published : Nov 1, 2020, 3:02 PM IST

Updated : Nov 1, 2020, 7:12 PM IST

CSK VS KXIP MATCH LIVE
చెన్నై vs పంజాబ్

19:09 November 01

చెన్నై ఘనవిజయం

పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాడు రుతురాజ్ (62) అద్భుత అర్దశతకంతో జట్టుకు వియాన్నందించాడు. డుప్లెసిస్ 48 పరుగులతో రాణించాడు. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది పంజాబ్. చెన్నై ఏడో స్థానానికి ఎగబాకింది.

18:57 November 01

చెన్నై విజయానికి 18 బంతుల్లో 16 రన్స్

విజయం దిశగా వెళుతోంది చెన్నై. ప్రస్తుతం 17 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. రుతురాజ్ (52) మరో అర్ధశతకంతో అద్భుతంగా ఆడుతున్నాడు. అతడికి రాయుడు (26) మద్దతుగా నిలుస్తున్నాడు. చెన్నై గెలుపు కోసం ఇంకా 18 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. 

18:32 November 01

లక్ష్యం దిశగా చెన్నై

లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగిస్తోంది చెన్నై. ప్రస్తుతం 12 ఓవర్లకు వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. రుతురాజ్ (39), రాయుడు (11) క్రీజులో ఉన్నారు.

17:57 November 01

లక్ష్యంవైపు సాగుతున్న చెన్నై.. పవర్​ప్లే(6 ఓవర్లు) పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 57 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్, డుప్లెసిస్ ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 97 పరుగులు కావాలి.

17:43 November 01

154 పరుగుల ఛేదనను ధాటిగా ఆరంభించింది చెన్నై. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్, రుతురాజ్ ఉన్నారు. విజయానికి మరో 132 పరుగులు కావాలి.

17:07 November 01

చెన్నై బౌలర్లు ధాటికి పంజాబ్ బ్యాట్స్​మెన్ తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగలిగింది. దీపక్ హుడా(62 నాటౌట్) అర్థశతకంతో మెరిశాడు. మిగిలిన బ్యాట్స్​మెన్ అందరూ స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. చెన్నై బౌలర్లలో ఎంగిడి 3, శార్దుల్ ఠాకుర్, జడేజా, తాహిర్ తలో వికెట్ తీశారు.

16:40 November 01

నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్.. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో మన్​దీప్, దీపక్ హుడా ఉన్నారు. అంతకు ముందు కేఎల్ రాహుల్ 29, మయాంక్ అగర్వాల్ 26, గేల్ 12, పూరన్ 2 పరుగులు చేసి ఔటయ్యారు.

16:15 November 01

ఓపెనర్లు వికెట్లు పడటంతో పంజాబ్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 65 పరుగులు చేసింది. క్రీజులో గేల్, పూరన్ ఉన్నారు. అంతకు ముందు కేఎల్ రాహుల్ 29, మయాంక్ అగర్వాల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరిని ఎంగిడి పెవిలియన్​కు చేర్చాడు.

15:41 November 01

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్.. ఇన్నింగ్స్​ను ధాటిగా ప్రారంభించింది. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.

14:53 November 01

పంజాబ్​కు గెలుపు చాలా ముఖ్యం

అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన చెన్నై సూపర్​కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగనుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. అయితే ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్​లో కచ్చితంగా పంజాబ్ గెలిచి తీరాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

జట్లు

చెన్నై: డుప్లెసిస్, రుతురాజ్, రాయుడు, ధోనీ(కెప్టెన్), జగదీశన్, జడేజా, సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, ఎంగిడి, తాహిర్

పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, గేల్, పూరన్, మన్​దీప్ సింగ్, నీషమ్, దీపక్ హుడా, జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమి

Last Updated : Nov 1, 2020, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.