ETV Bharat / sports

స్టోక్స్ వచ్చాడు.. సన్​రైజర్స్​తో మ్యాచ్​కు రెడీ

తండ్రి అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్​ వెళ్లిన ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​.. ప్రస్తుతం ఐపీఎల్​లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. నేడు యూఏఈ చేరుకున్న స్టోక్స్..​ మొదట కొవిడ్​ టెస్టు చేయించుకుని ఆరు రోజుల నిర్బంధాన్ని పాటించనున్నాడు.

IPL 2020: Ben Stokes arrives in UAE, Should Be Ready For SunRisers Hyderabad Match
సన్​రైజర్స్​ మ్యాచ్​లో బెన్​స్టోక్స్​ అందుబాటు
author img

By

Published : Oct 4, 2020, 5:23 PM IST

రాజస్థాన్​ రాయల్స్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ ఐపీఎల్​లో అడుగుపెట్టనున్నాడు. ఆదివారం యూఏఈ చేరాక కొవిడ్​ టెస్టు చేయించుకుంటాడని.. ఆ తర్వాత వెంటనే ఆరు రోజుల పాటు నిర్బంధంలో ఉంటాడని రాజస్థాన్​ జట్టుకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అక్టోబరు 11న సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగే మ్యాచ్​తో స్టోక్స్​ అందుబాటులోకి వస్తాడని తెలిపారు.

"స్టోక్స్​ హోటల్​కు చేరుకున్న వెంటనే తన నిర్బంధాన్ని ప్రారంభిస్తాడు. ఈరోజే అతడికి మొదటి కొవిడ్​ టెస్టు చేస్తారు. స్టోక్స్​ 6 రోజుల నిర్బంధం పూర్తయ్యే రోజునే(అక్టోబరు 9) దిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​ ఉంటుంది. అయినా అతడిని అక్టోబరు 11న సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగే మ్యాచ్​తో తుదిజట్టులో ఆడించాలని భావిస్తున్నాం. ఎందుకంటే స్టోక్స్​ కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నందున తిరిగి గాడిలోకి రావడానికి హైదరాబాద్​తో మ్యాచ్​కు ముందు ప్రాకీస్టు ఉపయోగపడుతుంది."

- రాజస్థాన్​ రాయల్స్​ జట్టు అధికారి

యూకే బయో-బబుల్​ నుంచి దుబాయ్​ వచ్చిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లను 36 గంటలు నిర్బంధంలో ఉంచగా.. అబుదాబి వెళ్లిన క్రికెటర్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాల్సి వచ్చింది. అదే విధంగా న్యూజిలాండ్​ నుంచి యూఏఈకి వచ్చిన బెన్​ స్టోక్స్​ ఆరు రోజుల క్వారంటైన్​లో ఉంటాడు.

అబుదాబి వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ ఓటమి పాలైంది. ఐపీఎల్​లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్​లు ఆడిన స్మిత్​ సేన రెండు విజయాలను నమోదు చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.