కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ అసలు జరుగుతుందో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ భారత్‌లో వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్న దృష్ట్యా యూఏఈలో లీగ్ జరిపేందుకు మొగ్గుచూపింది పాలకమండలి. ప్రస్తుతం అక్కడ జరుగుతోన్న ఐపీఎల్ ఖాళీ మైదానాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లను చూడటానికి ప్రేక్షకులు టీవీలు, మొబైల్స్‌ను ఎంచుకున్నారు. ఈ కారణంగా ఐపీఎల్ వ్యూయర్షిప్ పెద్దమొత్తంలో పెరిగింది. గతేడాదితో పోలిస్తే 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ విషయాన్ని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది.
బార్క్ డాటా ప్రకారం ఇప్పటివరకు 21 ఛానెల్స్‌లో ప్రసారమైన 41 మ్యాచ్‌లకు 7 వందల కోట్ల నిమిషాల వ్యూస్ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే వీక్షణల్లో 28 శాతం పెరుగుదల కనిపించింది. ఐపీఎల్ 12వ సీజన్ 24 ఛానెళ్లలో ప్రసారం కాగా 44 మ్యాచ్‌లకు 550 కోట్ల నిమిషాల వీక్షణలు వచ్చాయి.
వ్యూయర్షిప్లో పెరుగుదలకు కరోనానే కారణమని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. "ఎవరూ స్టేడియాల్లో మ్యాచ్‌లు చూడట్లేదు. అందరూ టీవీల్లో చూస్తున్నారు. అందువల్ల కచ్చితంగా వీక్షణలు పెరుగుతాయి" అంటూ కామెంట్లు చేస్తున్నారు.