ETV Bharat / sports

చెన్నై సూపర్​కింగ్స్ వైఫల్యానికి అదే కారణం: లారా - ఐపీఎల్​ 2020 వార్తలు

ఈ ఐపీఎల్​లో చెన్నై విఫలమవడానికి గల కారణాన్ని చెప్పిన బ్రియాన్ లారా.. యువ ఆటగాళ్లకు జట్టులో చోటివ్వాలని సూచించాడు. తర్వాతి సీజన్​లోనైనా తిరిగి పుంజుకోవాలని అభిప్రాయపడ్డాడు.

IPL 13: CSK backed experience over youth, it turned upside down for them, says Lara
'యువతకు ఛాన్స్​ ఇవ్వకపోవడం వల్లే సీఎస్కే విఫలం'
author img

By

Published : Oct 29, 2020, 4:16 PM IST

ఈ సీజన్​లో చెన్నై సూపర్​కింగ్స్​ వైఫల్యం చెందడం గురించి దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా మాట్లాడాడు. జట్టులోని యువ క్రికెటర్లకు సరైన అవకాశాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. వీటన్నింటిని మర్చిపోయి వచ్చే ఏడాది తిరిగి పుంజుకోవాలని సీఎస్కేకు సూచించాడు.

"చెన్నై సూపర్​కింగ్స్​లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారి బ్యాటింగ్​ లైనప్​లో యువ క్రికెటర్లు ఎవరూ లేరు. ఈ సీజన్​లో యువత కంటే సీనియర్​ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం సీజన్ నాకైతే​ నమ్మశక్యం కావడం లేదు. ధోనీసేన తిరిగి పుంజుకుంటుందని మేం ఎంతో ఆశగా ఎదురుచూశాం. కానీ అది జరగలేదు. రానున్న ఏడాదైనా చెన్నై మెరుగ్గా రాణిస్తుందని అనుకుంటున్నాను. మిగిలిన మ్యాచ్​ల్లో యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చి వారేమి చేయగలరో చూడండి"

-బ్రియాన్​ లారా, వెస్టిండీస్​ దిగ్గజ క్రికెటర్​

ప్రస్తుత సీజన్​లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ధోనీసేన వైదొలగింది. టోర్నీ చరిత్రలో మొదటిసారి చెన్నై సూపర్​కింగ్స్​ నాకౌట్​ దశకు చేరుకోలేకపోయింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్​ల్లో కేవలం 4 మాత్రమే గెలిచింది. జట్టులోని సీనియర్​ ఆటగాళ్లు అనుకున్నంతగా రాణించలేకపోయారు. సురేశ్​ రైనా, హర్భజన్​ సింగ్​ లాంటి స్టార్​ ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో టోర్నీలో పాల్గొనలేకపోవడం మరో ప్రతికూల అంశమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.