ETV Bharat / sports

నేను బ్యాటింగ్​ సరిగ్గా చేయలేకపోతున్నా: స్మిత్​ - ఐపీఎల్​ 2020 స్మిత్​

తమ జట్టు వరుస ఓటములపై స్పందించిన రాజస్థాన్​ జట్టు​ సారథి​ స్మిత్​.. తాను కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడని అన్నాడు. తమ జట్టు త్వరలోనే పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

smith
స్టీవ్​ స్మిత్
author img

By

Published : Oct 10, 2020, 11:49 AM IST

తాను ఐపీఎల్​లో సరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నానని రాజస్థాన్ రాయల్స్ స్మిత్ చెప్పాడు. దిల్లీ క్యాపిటల్స్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ఓటమి అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్​తో వరుసగా నాలుగుసార్లు ఓటమి పాలైంది.

"ప్రస్తుతం మా టైమ్ బాగోలేదు. త్వరలోనే పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. మా జట్టు పుంజుకుంటుంది. మేం సానుకూల దృక్పథంతోనే ఉంటాం. నేను సరిగ్గా బ్యాటింగ్​ చేయలేకపోతున్నాను. దిల్లీతో మ్యాచ్​లోనైనా బాగా ఆడాలనుకున్నాను. కానీ ఏమి చేయలేకపోయాను"

-స్మిత్​, రాయల్స్​ సారథి

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్ ​స్టోక్స్ క్వారంటైన్ పూర్తయిందని.. తాము ఆడబోయే తర్వాతి మ్యాచుల్లో అతడు అందుబాటులో ఉంటాడని స్మిత్ చెప్పాడు​. రాయల్స్​, అక్టోబర్​ 11న సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడనుంది.

ఇదీ చూడండి 'అయిపోయాం అనుకున్నా.. బౌలర్లు ఆదుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.