ETV Bharat / sports

'ప్లేఆఫ్​ మ్యాచ్​కు అందుబాటులో ఆ ముగ్గురు' - హార్దిక్​ పాండ్యా రోహిత్​ శర్మ వార్తలు

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా.. బౌలర్లు బుమ్రా, బౌల్ట్​ ఆడకపోవడంపై కెప్టెన్​ రోహిత్​శర్మ స్పష్టత ఇచ్చాడు. జట్టులో మిగిలిన వారికి అవకాశాలు ఇవ్వడానికే వారికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు. ప్లేఆఫ్​ మ్యాచ్​కు ఆ ముగ్గురు అందుబాటులో ఉంటారని చెప్పాడు.

'I am sure Hardik Pandya will be ready for the playoffs' - Rohit Sharma
'ఆ ముగ్గురూ ప్లేఆఫ్​ మ్యాచ్​కు అందుబాటులో ఉంటారు'
author img

By

Published : Nov 4, 2020, 8:01 PM IST

Updated : Nov 4, 2020, 8:13 PM IST

ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా.. హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఆడకపోవడంపై ఆ జట్టు కెప్టెన్​ రోహిత్​శర్మ స్పందించాడు. హార్దిక్​కు ఫిట్​నెస్​ సమస్యలేవి లేవని.. మరికొంత మంది ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే ఆల్​రౌండర్​కు విశ్రాంతి కల్పించామని మంగళవారం జరిగిన మ్యాచ్ అనంతర సమావేశంలో వెల్లడించాడు. ప్లే-ఆఫ్​ మ్యాచ్​లో పాండ్యా కచ్చితంగా ఆడతాడని హిట్​మ్యాన్ తెలిపాడు.

"హార్దిక్​ పాండ్యాకు ఫిట్​నెస్ పరంగా ఎలాంటి సమస్య లేదు. సన్​రైజర్స్​ మ్యాచ్​లో అతడికి విరామం ఇవ్వాలని మేము భావించాం. అతడి స్థానంలో మిగిలిన వాళ్లకి అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. కానీ, ప్లేఆఫ్​ మ్యాచ్​కు హార్దిక్​ సిద్ధంగా ఉంటాడు".

- రోహిత్​ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ ​

హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో జస్​ప్రీత్​ బుమ్రా, ట్రెంట్​ బౌల్ట్​ ఆడకపోవడంపై కెప్టెన్​ రోహిత్​శర్మ స్పష్టత ఇచ్చాడు. "వీరిద్దరూ ప్రత్యర్థి వికెట్లు తీయడంలో మా జట్టుకు సహకరిస్తున్నారు. అవసరం వచ్చినప్పుడల్లా జట్టుకు అండగా నిలుస్తున్నారు. సన్​రైజర్స్​ మ్యాచ్​లో వారి సేవలను కోల్పోయాం. కానీ వారిద్దరిపైనే ఎక్కువ పనిభారం మోపలేము. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. కానీ, ప్లేఆఫ్​ మ్యాచ్​కు వీరిద్దరూ సిద్ధంగా ఉంటారని భావిస్తున్నా" అని రోహిత్​ శర్మ అన్నాడు.

Last Updated : Nov 4, 2020, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.