కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కామెంట్ చేశాడు. కోహ్లీతో పాటు అనుష్క శర్మపైనా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు.
గావస్కర్‌ను తొలగించాలి
పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ రెండు క్యాచ్‌లు వదిలేయడం సహా బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. దీనిపై కామెంటరీ బాక్స్‌లో ఉన్న గావస్కర్.. కోహ్లీ, అనుష్కల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆగ్రహించిన విరాట్ అభిమానులు గావస్కర్‌ను కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించాలని బీసీసీఐని కోరారు.
ఆ క్యాచ్‌ల విలువ 132 రన్స్
ఈ మ్యాచ్‌లో కోహ్లీ జారవిడిచిన రెండు క్యాచ్‌లు కేఎల్ రాహుల్‌కు చెందినవే. దీని వల్ల బెంగళూరు భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 69 బంతుల్లో 132 పరుగులు సాధించి.. టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు రాహుల్.
గతంలోనూ కోహ్లీ తన ప్రదర్శనలో విఫలమైన కొన్ని సందర్భాల్లోనూ అనుష్కను జోడించి పలువురు నిందించారు.