యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ ముగిసింది. ఫ్యాన్స్‌కు ఎన్నో జ్ఞాపకాల్ని మిగుల్చుతూ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తుదిపోరులో ముంబయి ఇండియన్స్ విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. అనేక అనుభూతుల మధ్య ఈ టోర్నీ పూర్తయినా.. త్వరలోనే మళ్లీ మరో సీజన్ ప్రారంభం కానుంది. మార్చి-ఏప్రిల్‌లో ఐపీఎల్ 14వ సీజన్ మొదలవనుంది. ఈ టోర్నీకి ముందు అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనుంది బీసీసీఐ.
వచ్చే సీజన్లో మరో కొత్త జట్టును ఏర్పాటు చేయనుంది. అంటే 9 జట్లతో లీగ్ నిర్వహించున్నారని సమాచారం. ఇప్పటికే కొత్త జట్టును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక లోటును పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఈ లీగ్‌కు ముందు మెగా వేలం ఉండనుందట. కొత్త సీజన్ ప్రారంభానికి తక్కువ సమయమే ఉండటం వల్ల అసలు వేలం నిర్వహిస్తారో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ మెగా వేలంతో వచ్చే సీజన్లో మరింత కిక్ ఇచ్చేందుకు పాలకమండలి సిద్ధమయినట్లు సమాచారం.