చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో.. మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడటం లేదు. త్వరలో తన దేశానికి వెళ్లిపోనున్నాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. సీనియర్ ఆటగాళ్లు రైనా, హర్భజన్ లేకపోవడం.. ఈ సీజన్లో జట్టు విఫలమవడానికి ఓ కారణమని అభిప్రాయపడ్డారు. అయితే టోర్నీకి దూరంగా ఉండాలనే వారి నిర్ణయాల్ని తాము గౌరవించామని అన్నారు. మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు బ్రావో స్థానంలో తాహిర్‌ను తీసుకునే అవకాశముంది.
ఇటీవలే దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా బ్రావో గాయపడ్డాడు. దీంతో ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను జడేజాతో వేయించాడు ధోనీ. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సిక్సులు కొట్టి, లక్ష్యాన్ని పూర్తి చేయడం వల్ల దిల్లీ విజయం సాధించింది.
ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడి కేవలం మూడింట్లోనే గెలిచింది చెన్నై. దీంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫ్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ విషయమై ధోనీతో పాటు ఇతర జట్టులోని ఇతర ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి.