హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ జట్టుకు బ్రేక్ వేసింది ముంబయి ఇండియన్స్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్న పంజాబ్‌ను ఓడించింది చెన్నై. హైదరాబాద్- పంజాబ్ జట్ల మధ్యే నేడు సమరం. మొహాలి వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఇప్పటివరకు ఓపెనర్లపైనే ఎక్కువగా ఆధారపడింది సన్‌రైజర్స్. గత మ్యాచ్‌లో వారు విఫలమయ్యేసరికి జట్టు 96 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో మిడిల్ ఆర్డర్ రాణించాల్సుంది. మరోవైపు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో వేగంగా పరుగులు రాబట్టుకోలేక పరాజయం పాలైంది పంజాబ్. చెరో మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది.
- సన్‌రైజర్స్ హైదరాబాద్..
ఎక్కువగా టాప్ఆర్డర్పైనే ఆధారపడుతున్న సన్‌రైజర్స్.. మిడిల్ ఆర్డర్‌పై దృష్టిసారించాల్సి ఉంది. మనీశ్ పాండే, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్ ఫామ్‌లోకి రావాల్సిఉంది. ముంబయిపై మ్యాచ్‌లో వీరికి నిరూపించుకునే అవకాశమొచ్చినా నిలకడగా ఆడలేకపోయారు. 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి 3 మ్యాచ్‌ల్లో సత్తా చాటిన వార్నర్.. దిల్లీ, ముంబయి మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. బౌలింగ్‌లో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాల్సి ఉంది రైజర్స్.
-
Hyderabad ✈ Mohali
— SunRisers Hyderabad (@SunRisers) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Up north for our next challenge.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/PbtRfZYQGi
">Hyderabad ✈ Mohali
— SunRisers Hyderabad (@SunRisers) April 7, 2019
Up north for our next challenge.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/PbtRfZYQGiHyderabad ✈ Mohali
— SunRisers Hyderabad (@SunRisers) April 7, 2019
Up north for our next challenge.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/PbtRfZYQGi
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (55), సర్ఫ్రాజ్ ఖాన్ (67) అర్ధ శతకాలతో రాణించినా.. జట్టును గెలిపించలేకపోయారు. 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 138కే పరిమితమయ్యింది పంజాబ్. ప్రారంభం నుంచి నిదానంగా సాగింది పంజాబ్ ఇన్నింగ్స్. గేల్, మిల్లర్ లాంటి హిట్టర్లు త్వరగానే పెవిలియన్ చేరారు. మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్‌లు మిడిల్ ఆర్డర్లో సత్తా చాటాల్సి ఉంది. బౌలింగ్‌లో అశ్విన్, మురుగన్ అశ్విన్, సామ్ కరన్‌లతో బలంగా ఉంది పంజాబ్ జట్టు.
రెండు జట్లలో టాప్ఆర్డర్, లోయర్ ఆర్డర్ బలంగా ఉండగా.. మిడిల్ ఆర్డర్ సమస్యగా మారింది. నబీ, రషీద్ ఖాన్ల స్పిన్ మాయాజాలాన్ని గేల్, మిల్లర్ ఎంత మేరకు తట్టుకుంటారో వేచి చూడాలి. సొంత గడ్డపై మ్యాచ్ జరగనుండడం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం.
-
Chennai ✈ Mohali
— Kings XI Punjab (@lionsdenkxip) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Our #Shers are back home. 🤗#SaddaPunjab #SaddaSquad #KXIP pic.twitter.com/FYUuo6xlwW
">Chennai ✈ Mohali
— Kings XI Punjab (@lionsdenkxip) April 7, 2019
Our #Shers are back home. 🤗#SaddaPunjab #SaddaSquad #KXIP pic.twitter.com/FYUuo6xlwWChennai ✈ Mohali
— Kings XI Punjab (@lionsdenkxip) April 7, 2019
Our #Shers are back home. 🤗#SaddaPunjab #SaddaSquad #KXIP pic.twitter.com/FYUuo6xlwW
జట్ల అంచనా..
- సన్‌రైజర్స్ హైదరాబాద్:
భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విజయ్‌శంకర్, మనీశ్ పాండే, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్, నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), లోకేశ్ రాహుల్ (కీపర్), క్రిస్ గేల్, సామ్ కరన్, మయాంక్ అగర్వాల్, సర్ఫ్రాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్దీప్ సింగ్, మురుగన్ అశ్విన్, షమి, ఆండ్రూ టై.