ఎట్టకేలకు ఈ సీజన్ ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బోణి కొట్టింది. మొహాలీ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ కోహ్లి, డివిలియర్స్ అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. పంజాబ్ జట్టులో గేల్ 99 పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది.
-
A victory at Mohali as @RCBTweets register their first win of the #VIVOIPL 2019 season 👌🙌 pic.twitter.com/yESiuz1KAl
— IndianPremierLeague (@IPL) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A victory at Mohali as @RCBTweets register their first win of the #VIVOIPL 2019 season 👌🙌 pic.twitter.com/yESiuz1KAl
— IndianPremierLeague (@IPL) April 13, 2019A victory at Mohali as @RCBTweets register their first win of the #VIVOIPL 2019 season 👌🙌 pic.twitter.com/yESiuz1KAl
— IndianPremierLeague (@IPL) April 13, 2019
174 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్ కోహ్లి(67 పరుగులు) వీలుచిక్కనప్పుడల్లా బంతులను బౌండరీలకు తరలించాడు. మరో ఎండ్‌లో పార్థివ్ పటేల్ కొంత సేపు కెప్టెన్‌కు సహకారమందించాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేసి ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్.. తనదైన శైలిలో చెలరేగాడు. చివరి వరకు నిలిచి 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగతా వారిలో స్టాయినిస్ 28 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డివిలియర్స్‌కు దక్కింది.
పంజాబ్ బౌలర్లలో షమి, కెప్టెన్ అశ్విన్ మాత్రమే తలో వికెట్ తీశారు. మిగతా వారు వికెట్లేమి తీయలేకపోయారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు 66 పరుగుల భాగస్వామ్యం ఇచ్చారు. చివరి వరకు నిలిచిన గేల్... కేవలం ఒక పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ 18, మయాంక్ 15, సర్ఫరాజ్ 15, శామ్ కరన్ 1, మన్దీప్ సింగ్ 18 పరుగులు చేశారు.
బెంగళూరు బౌలర్లలో చాహల్ 2 వికెట్లు తీశాడు. సిరాజ్, అలీ తలో వికెట్ పడగొట్టారు.