దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ త్వరలో ఐపీఎల్లో కనిపించనున్నాడు. కోహ్లి నాయకత్వం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. గాయం కారణంగా సీజన్‌కు దూరమైన కౌల్టర్‌నైల్ స్థానాన్ని స్టెయిన్ భర్తీ చేయనున్నాడు.
'ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మిగతా మ్యాచ్‌ల్లో స్టెయిన్ ఆడనున్నాడు.' -ఐపీఎల్ ప్రతినిధి
2008, 2010లో ఆర్సీబీకి ఆడి 27 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 9 ఎడిషన్స్‌లో పాల్గొన్నాడీ సౌతాఫ్రికా పేసర్.
గతేడాది జరిగిన వేలంలో అమ్ముడుపోలేదీ బౌలర్. 2016లో చివరిసారిగా గుజరాత్ లయన్స్ జట్టు తరఫున ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించాడు.
ప్రస్తుత సీజన్లో ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది కోహ్లి సేన. మరి స్టెయిన్ రాకతోనైనా బలం పుంజుకుంటుందేమో చూడాలి.