సొంతగడ్డపై బెంగళూరుతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది దిల్లీ క్యాపిటల్స్. శ్రేయస్ అయ్యర్, ధావన్ అర్ధ శతకాలతో రాణించారు.
-
Half-centuries from Shikhar Dhawan and Shreyas Iyer guide the @DelhiCapitals to a total of 187/5 after 20 overs.
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Will the @RCBTweets chase this down? #DCvRCB pic.twitter.com/dMIJ80fyUo
">Half-centuries from Shikhar Dhawan and Shreyas Iyer guide the @DelhiCapitals to a total of 187/5 after 20 overs.
— IndianPremierLeague (@IPL) April 28, 2019
Will the @RCBTweets chase this down? #DCvRCB pic.twitter.com/dMIJ80fyUoHalf-centuries from Shikhar Dhawan and Shreyas Iyer guide the @DelhiCapitals to a total of 187/5 after 20 overs.
— IndianPremierLeague (@IPL) April 28, 2019
Will the @RCBTweets chase this down? #DCvRCB pic.twitter.com/dMIJ80fyUo
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది దిల్లీ. ఓపెనర్లు పృథ్వీషా, ధావన్.. తొలి బంతి నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పృథ్వీషా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. ధావన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో పంత్ 7, ఇంగ్రామ్ 11 పరుగుల చేసి పెవిలియన్ బాట పట్టారు. చివర్లో వచ్చిన రూథర్‌ఫర్డ్ 28, అక్షర్ పటేల్ 16 మెరుపులతో 187 పరుగులు స్కోరు సాధించారు.
బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సైనీ తలో వికెట్ తీశారు.