జైపూర్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పరాజయం పాలైంది. రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించారు.
-
That's that from Jaipur as the @rajasthanroyals register a victory by 7 wickets with 5 deliveries to spare.#RRvSRH pic.twitter.com/uL7TPNrd4K
— IndianPremierLeague (@IPL) April 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Jaipur as the @rajasthanroyals register a victory by 7 wickets with 5 deliveries to spare.#RRvSRH pic.twitter.com/uL7TPNrd4K
— IndianPremierLeague (@IPL) April 27, 2019That's that from Jaipur as the @rajasthanroyals register a victory by 7 wickets with 5 deliveries to spare.#RRvSRH pic.twitter.com/uL7TPNrd4K
— IndianPremierLeague (@IPL) April 27, 2019
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రహానే 39, లివింగ్ స్టోన్ 44 పరుగులతో రాణించారు. తొలుత వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్.. తర్వాత బ్యాటు ఝళిపించారు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో సంజూ శాంసన్ 48 పరుగులతో రాణించాడు. చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. స్మిత్ 22 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
రైజర్స్ బౌలర్లలో షకిబుల్ హసన్, రషీద్ ఖాన్, ఖలీల్ తలో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. ఆదిలోనే విలియమ్సన్ వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే.. వార్నర్‌తో కలిసి రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
కానీ వీరిద్దరూ ఔటైన తర్వాతా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. భారీ స్కోరు చేస్తుందనుకున్న రైజర్స్ కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, థామస్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్ తలో రెండు వికెట్లు తీశారు.