ఐపీఎల్ 12వ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ అయినా గెలవని రెండు జట్లు విజయంపై కన్నేశాయి. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. వరుస ఓటములతో నిరాశలో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు చాలా అవసరం.
- ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచే స్థితి నుంచి ఓటమి చవిచూసింది రాజస్థాన్ రాయల్స్. వచ్చిన అవకాశాలను సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరుసగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులకే మూడు వికెట్లు తీసిన రాజస్థాన్.. తర్వాత ఆటపై పట్టు కోల్పోయింది. ధోని కీలక ఇన్నింగ్స్‌తో మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది.
Hey Challengers! Our Bold Squad is playing against Rajasthan Royals tomorrow at Jaipur tomorrow. Are you ready to Stay Bold and Cheer Bold! #PlayBold #RRvsRCB #VIVOIPL2019 pic.twitter.com/lhqS4S9Lgr
— Royal Challengers (@RCBTweets) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hey Challengers! Our Bold Squad is playing against Rajasthan Royals tomorrow at Jaipur tomorrow. Are you ready to Stay Bold and Cheer Bold! #PlayBold #RRvsRCB #VIVOIPL2019 pic.twitter.com/lhqS4S9Lgr
— Royal Challengers (@RCBTweets) April 1, 2019Hey Challengers! Our Bold Squad is playing against Rajasthan Royals tomorrow at Jaipur tomorrow. Are you ready to Stay Bold and Cheer Bold! #PlayBold #RRvsRCB #VIVOIPL2019 pic.twitter.com/lhqS4S9Lgr
— Royal Challengers (@RCBTweets) April 1, 2019
"ఓడినా, గెలిచినా అది జట్టుకే చెందుతుంది. మూడు మ్యాచుల్లోనూ మేము చాలా బాగా ఆడాం. కానీ అదృష్టం కలిసిరాలేదు".
-- అజింక్య రహానే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్
స్మిత్, స్టోక్స్ లాంటి ఆటగాళ్లున్నా రాజస్థాన్ అంచనాలను అందుకోలేకపోతుంది. ఐపీఎల్ 12వ సీజన్లో మొదటి సెంచరీ చేసిన సంజు శాంసన్.. ఓపెనర్లు బట్లర్, రహానే మంచి ప్రతిభ కనబరుస్తుండగా చెన్నైతో మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి ఆకట్టుకున్నాడు. స్మిత్, స్టోక్స్ ఫామ్‌లోకి రావల్సి ఉంది.
- మరోవైపు బెంగళూరు జట్టుది అదే పరిస్థితి. వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడి విమర్శలు ఎదుర్కొంటోంది. మొదటి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఘోర పరాజయం. ముంబయితో జరిగిన ఉత్కంఠ పోరులో ఓటమి చవిచూసింది. సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్.... రెండు విభాగాల్లోనూ విఫలమై మరో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది.
కోహ్లీ, డివిలియర్స్, పార్థివ్ పటేల్, మొయిన్ అలీ, హెట్మైర్ లాంటి ఆటగాళ్లున్నా ఆకట్టుకోలేకపోతున్నారు. బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉమేష్, చాహల్, సిరాజ్‌లతో కూడిన బౌలింగ్ విభాగంలో మరింత మెరుగవ్వాల్సి ఉంది.
జట్లు అంచనా:
- రాజస్థాన్ రాయల్స్:
అజింక్య రహానే (కెప్టెన్), స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బట్లర్, ఆష్టన్ టర్నర్, ఇష్ సోధి, ఒషానే థామస్, లివింగ్ స్టోన్, సంజు శాంసన్, శుభం రంజనే, స్టువర్ట్ బిన్నీ, శ్రేయాస్ గోపాల్, సుధేసన్ మిథున్, జయదేవ్ ఉనద్కట్, ప్రశాంత్ చోప్రా, మహిపాల్, ఆర్యమన్ బిర్లా, రియాన్ పరాగ్, ధవల్ కులకర్ణి, క్రిష్ణప్ప గౌతమ్, వరుణ్ అరోన్, శశాంక్ సింగ్, మనన్ వోహ్రా, రాహుల్ త్రిపాఠి
- బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్, మొయిల్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్మైర్, శివం దూబే, కొలిన్ డి గ్రాండ్ హోం, ఉమేష్ యాదవ్, చాహల్, మహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, హిమ్మత్ సింగ్, మిలింద్ కుమార్, గురుకీరత్ సింగ్, హెన్రిచ్ క్లాసన్, పవన్ నేగి, వాషింగ్టన్ సుందర్, అక్షదీప్ నాథ్, ప్రయాస్ బర్మన్, కుల్వంత్ ఖేజ్రోలియా, టిమ్ సౌథీ.