వెన్నునొప్పితో బాధపడుతున్న దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కగిసో రబాడ నేడు దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. ప్రపంచకప్ దృష్ట్యా ముందు జాగ్రత్తగా స్వదేశానికి రావాలని రబాడను వెనక్కి పిలిచింది దక్షిణాఫ్రికా బోర్డు.
-
🚨 ANNOUNCEMENT 🚨@KagisoRabada25 to miss the rest of our season after being recalled by Cricket SA for precautionary reasons ahead of the World Cup.#ThankYouKagiso #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/eUARj0i2Mv
— Delhi Capitals (@DelhiCapitals) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">🚨 ANNOUNCEMENT 🚨@KagisoRabada25 to miss the rest of our season after being recalled by Cricket SA for precautionary reasons ahead of the World Cup.#ThankYouKagiso #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/eUARj0i2Mv
— Delhi Capitals (@DelhiCapitals) May 3, 2019🚨 ANNOUNCEMENT 🚨@KagisoRabada25 to miss the rest of our season after being recalled by Cricket SA for precautionary reasons ahead of the World Cup.#ThankYouKagiso #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/eUARj0i2Mv
— Delhi Capitals (@DelhiCapitals) May 3, 2019
'ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ముందు దిల్లీ క్యాపిటల్స్‌ను వీడి వెళ్తుండటం చాలా కష్టంగా ఉంది. కానీ ప్రపంచకప్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. అందుకే బోర్డు స్వదేశానికి రమ్మని పిలిచింది. కొద్దిరోజుల్లోనే దిల్లీ జట్టుతో మంచి అనుబంధం ఏర్పడింది. కచ్చితంగా మా జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందని నమ్మకముంది.'
-- రబాడ, దిల్లీ క్యాపిటల్స్ పేసర్
'దిల్లీని ఇలాంటి పరిస్థితిలో వదిలి... రబాడ వెళ్లిపోతాడని అసలు ఊహించలేదు. అయితే జట్టంతా కప్పు గెలవాలని పట్టుదలతో ఉన్నారు. అందరూ సమష్టి ప్రదర్శనతో జట్టును మరింత ముందుకు తీసుకెళ్తారు.'
-- రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ కోచ్
ఐపీఎల్లో 12 మ్యాచ్‌లు ఆడిన రబాడ 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. దిల్లీ 7 సంవత్సరాల తర్వాత ప్లేఆఫ్‌కు చేరడంలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. దిల్లీ తర్వాత లీగ్ మ్యాచ్‌ను.. శనివారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.